EntertainmentLatest News

తెలంగాణ సీఎం అభ్యర్థి సినిమా


సినిమాలకి రాజకీయాలకి విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు సినిమా పుట్టినప్పటినుంచి 

చాలా మంది రాజకీయ నాయకుల  బయోపిక్ లు వచ్చాయి. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ కి సంబంధించిన ఒక నాయకుడి బయోపిక్ తో ఒక సినిమా రాబోతుంది. తెలంగాణాలో వచ్చేనెల నవంబర్ చివరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ టైం లో  తెరకెక్కుతున్న తెలంగాణ నాయకుడి బయోపిక్ సినిమా నుంచి  రిలీజ్ అయిన టీజర్  తెలంగాణాలో కాకలు పుట్టిస్తుంది.

నంద కిషోర్ ,రోజా హీరో హీరోయిన్లు గా  దుర్గా నాయుడు దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ప్రవీణ్ ఐ.పి.ఎస్. ఈ చిత్రం ప్రస్తుత బహుజన సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్  ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా  తెరకెక్కుతుంది. తాజాగా ఆ మూవీ కి సంబంధించిన  టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. బహుజనులు బానిసలు కాదని వాళ్లకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చే ఒక వ్యక్తి రాబోతున్నాడని సాగిన టీజర్ లో ప్రవీణ్ కుమార్ ని ఫుల్ గా ఎలివేట్ చేసారు. సినిమా కూడా సరిగ్గా ఎన్నికలకి కొన్ని రోజుల ముందే విడుదల కాబోతుంది.

 ఐపిఎస్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయిన ప్రవీణ్ కుమార్ తెలంగాణాలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్ వాది పార్టీ లో చేరారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ ప్రవీణ్ ఐ.పి ఎస్ సినిమా ఎలాంటి సంచలనాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాకి  నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 



Source link

Related posts

Saindhav Movie Release Date Confirmed వెంకీ సైంధవ్ రిలీజ్ కూడా అప్పుడే..

Oknews

టాలీవుడ్‌కి టాప్‌ డైరెక్టర్లను పరిచయం చేసిన ఘనత మాస్‌ రాజా రవితేజదే!

Oknews

Todays top ten news at Telangana Andhra Pradesh 11 february 2024 latest news | Top Headlines Today: ఎమ్మెల్యేల చేరికలపై రేవంత్ దృష్టి పెట్టలేదా?; నేటి నుంచే లోకేశ్ ఎన్నికల శంఖారావం

Oknews

Leave a Comment