ఏపీలో వర్షాలుఏపీలో వాతావరణం(AP Weather) చల్లబడింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో(Coastal Andhra Weather) బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఎల్లుండి(మార్చి 20) అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు(AP Rains) పడనున్నాయని తెలిపింది. అలాగే మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండవద్దని తెలిపింది. పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Source link