Top Stories

త్రివిక్రమ్-ఎన్టీఆర్.. సాధ్యమేనా?


అజ్ఞాతవాసి సినిమా. దారుణ పరాజయం.. దర్శకుడు త్రివిక్రమ్ దాదాపుగా మౌన ముద్రలోకి వెళ్లి ఒంటరిగా వుండిపోయిన తరుణం. ఎన్టీఆర్‌తో సినిమా అవకాశం. అరవింద సమేత అంటూ మళ్లీ త్రివిక్రమ్ తానేమిటో ప్రూవ్ చేసుకున్న వైనం.

మళ్లీ ఇప్పుడు అదే రిపీట్ కాబోతోందా? అజ్ఞాతవాసి అంత డిజాస్టర్ కాకపోయినా, గుంటూరు కారం బ్లాక్ బస్టర్, బంపర్ హిట్ అయితే కాదు. సీడెడ్, నైజాం, కర్ణాటక, ఓవర్ సీస్‌ల్లో నష్టాలే మిగిల్చింది బయ్యర్లకు. ఇప్పుడు కూడా మళ్లీ త్రివిక్రమ్ మౌనంగా వున్నారు. ఎవరినీ పెద్దగా కలవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదంతా తాత్కాలికమే. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం మాదిరిగా, సినిమా రంగంలో ఫ్లాప్ వైరాగ్యం. గుంటూరు కారం సినిమా విషయంలో హీరో మహేష్ బాబును ఎవ్వరూ తప్పు పట్టలేదు. ఆయన వర్క్ ఆయన చేసారు అన్న క్లారిటీ వచ్చింది. ఎటొచ్చీ పాత రొట్ట కథ, కథనాలు అందించారని త్రివిక్రమ్ నే విమర్శలకు గురయ్యారు.

సరే, అయిందేదో, అయింది. ఇప్పుడు ఏంటీ? త్రివిక్రమ్ మిడ్ రేంజ్ హీరోలతో సినిమా చేస్తారా? లేదే డేట్‌లు ఇచ్చే పెద్ద హీరో ఎవరు?

హీరో రామ్‌తో సినిమా ఒకటి చేయమని, నిర్మాత స్రవంతి రవికిషోర్ ఏనాటి నుంచో అడుగుతున్నారు. ఆయనతో త్రివిక్రమ్ కు అలనాటి నుంచి స్నేహబంధం వుంది. మరి దానికి లొంగి ఒకె అంటారా?

విజయ్ దేవరకొండ డేట్‌లు సితార సంస్థ దగ్గర వున్నాయి. గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం. వాటిని వాడి త్రివిక్రమ్ సినిమా చేస్తారా?

నానితో త్రివిక్రమ్ కాంబినేషన్ ఫుల్ ఫ్యామిలీ మీల్స్ అనే టాక్ ఎప్పటి నుంచో వుంది. అటు మల్లుతారా?

ఇవేవీ కాదని, ఎన్టీఆర్‌తో సినిమా వుండే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు గుంటూరు కారం సినిమాకు ముందు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమానే వుండాల్సి వుంది. కానీ నిర్మాణ వ్యవహారాల దగ్గర ఎక్కడో హారిక-హాసిని సంస్థకు, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థకు మధ్య చెడింది. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర పార్ట్ వన్ ముగించి, వార్ టు మీదకు వెళ్తారు. ఇవన్నీ ఏప్రిల్ వేరకు అయిపోతాయని తెలుస్తోంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయాలి. కానీ ప్రశాంత్ నీల్ మీద సలార్ 2 చేయమని వత్తిడి వస్తోంది. ఒక వేళ ప్రశాంత్ నీల్ కనుక అటు వెళ్తే, ఎన్టీఆర్ ఖాళీ అయిపోతారు.

ఈ ఖాళీని త్రివిక్రమ్‌తో పూరించవచ్చు అనే వార్తలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. గతంలో అంటే వ్యాపార లెక్కల దగ్గర హారిక హాసిని సంస్థ అధినేతలు పట్టుపట్టారు. ఈ సారి పట్టు పట్టకుండా దిగి రావచ్చు. అలా దిగి వస్తే మరో అరవింద సమేత లాంటి హిట్ సినిమా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో మనం చూడొచ్చు.



Source link

Related posts

నోటి దురుసుతో సిటింగ్ సీటు పోగొట్టుకున్న డిప్యూటీ సీఎం

Oknews

నీచంగా తిడితే తప్ప ఎమ్మెల్యేలను నమ్మలేం!

Oknews

డయాగ్నసిస్ సరిలేని చికిత్సతో ఏంలాభం?

Oknews

Leave a Comment