నాగ శౌర్య(naga sowrya)హీరోగా 2018 లో వచ్చిన ఛలో (chalo)మూవీ ద్వారా దర్శకుడుగా పరిచయమైన వ్యక్తి వెంకీ కుడుమల(venky kudumula)మొదటి సినిమాతోనే హిట్ ని అందుకొని విభిన్న దర్శకుడనే టాగ్ లైన్ ని పొందాడు. ఆ తర్వాత నితిన్ తో చేసిన భీష్మ కూడా హిట్ కావడంతో తిరుగులేని దర్శకుడు గా మారాడు. రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుపోతుంది.
రాబిన్ హుడ్( robinhood)…నితిన్ హీరోగా తెరకెక్కుతుంది. దీనికి వెంకీ నే దర్శకుడు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ గ్యాప్ లో వెంకీ తన వాయిస్ ఓవర్ తో ఒక చిన్న పాటి వీడియోని రిలీజ్ చేసాడు. నితిన్ తెల్లగడ్డంతో ఓల్డ్ లుక్ తో ఉన్నాడు. శ్రీలీల(sreeleela)మాత్రం మామూలుగానే ఉండి మేకప్ ని సరి చేసుకుంటుంది. వెంకీ తన వాయిస్ ఓవర్ లో నితిన్ ని చూపిస్తు రాబిన్ హుడ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇలా ఉంటాడని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే నితిన్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.ఇక శ్రీలీల ని చూపిస్తు నువ్వు సేమే ఉన్నావు. కాకపోతే ఇరవై ఐదేళ్ల ముందు ఓల్డ్ గానే ఉన్నావు. ఇప్పుడు అలాగే ఉన్నావు అని చెప్పుకొచ్చాడు.
ఇక కొన్ని రోజుల క్రితం రాబిన్ హుడ్. నుంచి వచ్చిన టీజర్ అంతే అదిరిపోయింది. నితిన్ గత చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ ప్లాప్ అవ్వడంతో నితిన్ తో పాటు ఆయన అభిమానుల ఆశలన్నీ రాబిన్ హుడ్ మీదే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్(mytri movie makers)నితిన్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రివిక్రమ్(trivikram)శ్రీనివాస్ శిష్యుడే వెంకీ కుడుమల.