Top Stories

దర్శకుడిని ఇబ్బంది పెడుతున్న హీరో


దర్శకుడు చెప్పింది చెప్పినట్లు వినేస్తే హీరో ఎందుకు అవుతారు? నీ ఎడం చేయి తీయి, నా లెఫ్ట్ హ్యాండ్ పెడతా అని అనాలి కదా? ఓ యంగ్ హీరో ఇలాగే ఆలోచిస్తారు అని ఇండస్ట్రీలో టాక్ వుంది.

కథలో దూరిపోతారని, మేకింగ్‌లో కలుగచేసుకుంటారని అంటారు. అయితే అది దర్శకుడిని బట్టి వుంటుంది అనే మినహాయింపు కూడా వుంది. ప్రస్తుతం ఓ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. అంతకు ముందు వారి కాంబినేషన్ లో వచ్చిన హిట్ కారణంగా ప్రాజెక్ట్ మీద క్రేజ్ వుంది.

కానీ ఆశించిన స్పీడ్ లో జరగడం లేదు. నిజానికి స్పీడ్ కు పెట్టింది పేరు ఆ దర్శకుడు. కానీ చేస్తున్న సినిమా మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఈ మధ్య ఓ షెడ్యూలు కూడా క్యాన్సిల్ అయింది. ఆర్ధిక ఇబ్బందులు అనే టాక్ వుంది.

కానీ అది మాత్రమే కాదు, హీరో ఇబ్బంది పెడుతున్నాడు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో సినిమా చేసినపుడు ఇదే హీరో ఈ మాదిరిగా లేడు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త తెేడాగా వుంది అన్న కామెంకట్ కూడా వినిపిస్తోంది.

ఏమైతేనేం డేట్ లైన్, డెడ్ లైన్ పెట్టుకుని, అనౌన్స్ చేసి మరీ సినిమా తీసి చూపించగల దర్శకుడు ఇప్పుడు కిందా మీదా అవుతున్నారు. ఈ నెలాఖరులో ఒక షెడ్యూలు ప్లాన్ చేసి వుంది. అది పెర్ ఫెక్ట్ గా జరిగితే ఓకె. లేదూ అదీ వాయిదా అంటే సమ్ థింగ్.. సమ్ థింగ్ అనుకోవాల్సిందే.



Source link

Related posts

హ‌వ్వా.. న‌వ్విపోతున్నారు బాబు!

Oknews

పాముకు కోర‌ల్లో విషం.. ష‌ర్మిల‌కు నిలువెల్లా!

Oknews

అబ‌ద్ధాల్ని గెలిపిస్తున్న భువ‌న‌మ్మ‌

Oknews

Leave a Comment