తెలుగు సినిమా ప్రేక్షకుడికి టైటిల్స్ ని చూపించకుండా కేవలం సినిమాని మాత్రమే చూపించి ఈ సినిమా దర్శకుడి పేరుని చెప్పమంటే అందరు ఇది శ్రీను వైట్ల(sreenu vaitla) సినిమా అని చెప్పేస్తారు.ఆ మాటకొస్తే సినిమా మొత్తం చూడక్కర్లేదు రెండు మూడు సీన్స్ చూసాకే శ్రీను వైట్ల సినిమా అని చెప్తారు. అంతలా ఆయన తెలుగు సినిమా రంగంలో ఒక బ్రాండ్ ని సృష్టించుకున్నాడు. జోనర్ ఏదైనా సరే తనదైన స్టైల్లో కామెడీ ని తెరకెక్కించి థియేటర్ కి రిపీట్ ఆడియెన్స్ ని రప్పించగల కెపాసిటీ ఆయన సొంతం. తాజాగా ఆయనకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
శ్రీను వైట్ల ప్రెజెంట్ గోపీచంద్(gopichand) తో ఒక మూవీ చేస్తున్నాడు.ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల నుంచి హిమాచల్ ప్రదేశ్ లో జరుపుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్ లో చలి తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో అందరకి తెలిసిందే.అంతటి తీవ్రమైన వాతావరణంలో కూడా యూనిట్ అంతా చాలా ఓర్పుతో పని చేసి అవుట్ ఫుట్ బాగా రావడానికి కృషి చేసింది. ఇప్పుడు శ్రీను వైట్ల ఈ విషయాన్నే ప్రస్తావిస్తు అక్కడి షూటింగ్ కి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. నా యూనిట్ కి ప్రత్యేకంగా తన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటు షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉంది.
ఇక గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేని శ్రీను వైట్ల గోపి చంద్ సినిమాతో తన సత్తా చాటాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ క్రేజీ మూవీకి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.