Health Care

దిండు వేసుకునా లేక దిండు లేకుండా పడుకుంటే లాభాలా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?


దిశ, ఫీచర్స్: ఆహారంతో పాటు నిద్ర కూడా మనిషికి గొప్ప ఔషధం. ప్రతి వ్యక్తి రోజులో కనీసం 7 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలి. లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే చాలామంది పడుకునేటప్పుడు తల కింద దిండు పెట్టుకొని పడుకుంటారు. మరికొందరు దిండు లేకుండానే పడుకుంటారు. మరి అసలు నిద్రించేటప్పుడు దిండు అవసరమా? దిండు లేకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

దిండు వేసుకుని పడుకుంటే ఏం జరుగుతుంది..

*దిండు వేసుకొని నిద్రపోవడం వల్ల వెన్నెముక బెండ్ కావడాన్ని నివారించవచ్చు. ఇది మెడ, తల, సైడ్, బ్యాక్ స్లీపర్ లకు ప్రయోజనకరంగా ఉంటుంది. చాలామంది దిండుకు కేవలం తల కింద మాత్రమే వేసుకుంటారు. అయితే దిండును తల కింద మాత్రమే కాకుండా మెడ కింద కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది.

*అదేవిధంగా దిండు వాడటం వల్ల శరీరం పై భాగంలో ఒత్తిడి స్థానాలైన మెడ, భుజాల పై ఒత్తిడి తగ్గుతుంది. ఇలా ఒత్తిడి తగ్గడం వల్ల ఆయా స్థానాల్లో కంఫర్ట్ గా ఉంటుంది. ఇది హాయిగా నిద్ర పట్టడానికి ఉపకరిస్తుంది.

*దిండు ఉపయోగించడం వల్ల తల సాధారణం కంటే కాస్త ఎత్తులో ఉంటుంది. ఇది శ్వాసనాళాలు తెరుచుకోవడానికి, శ్వాస వ్యవస్థ సమర్థవంతంగా సాగడానికి అనువుగా ఉంటుంది. నిద్రలో శ్వాసను మెరుగుపరుస్తుంది. శ్వాసలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తుంది.

*దిండు వేసుకొని నిద్రపోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దిండు వేసుకోవడం వల్ల తల కాస్త ఎత్తులో ఉంటుంది. జీర్ణాశయంలో ఉండే ఆమ్లాలు అన్నవాహిక లోకి చొచ్చుకువి రాకుండా చేయడంలో సహాయపడుతుంది.

దిండు లేకుండా పడుకుంటే ఏం జరుగుతుంది..

*బోర్లా పడుకునే వారికి దిండు లేకుండా పడుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దిండు లేకపోవడం వల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుంది.

*దిండు వేసుకుని పడుకున్నప్పుడు ముఖం దిండులోకి కుదించినట్లు ఉంటుంది. ఇది ముఖం మీద గీతలు, ముడతలు రావడానికి కారణం అవుతుంది.

* అయితే దిండు లేకుండా పడుకుంటే ఈ సమస్యలు ఎదురుకావు. మెడనొప్పి ఉన్నవారు దిండు లేకుండా పడుకోవడం మంచిది. ఇది మెదడు బెండ్ కాకుండా చేయడంలో సహాయపడుతుంది.

*దిండు లేకుండా పడుకుంటే కొందరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా నిద్ర వస్తుంది. ఇది శరీరం చాలా సహజంగా విశ్రాంతి తీసుకోవడానికి సాధ్యమవుతుంది.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Source link

Related posts

25 ఏళ్ల వయసులో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే..!

Oknews

అసలే ఎండకాలం.. ఫ్రిడ్జ్‌లో పెట్టిన మామిడిపండ్లను తింటున్నారా?

Oknews

ఇంట్రెస్టింగ్..మనుషుల మూడ్ స్వింగ్స్ మారడానికి సీజన్‌కు లింక్..! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

Oknews

Leave a Comment