Andhra Pradesh

దేనికి పోరాటం అవసరమో స్పష్టత లేని జగన్! Great Andhra


ప్రజా జీవితంలో ఉన్నవారికి తాము చేసే పోరాటాల మీద గట్టి పట్టు, అవగాహన, పట్టుదల కూడా ఉండాలి. ఒకసారి పోరాటంలోకి దిగిన తర్వాత ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోయే తత్వం ఉండాలి. ఏ ఊరికి వెళ్ళినా జనం తనను రిసీవ్ చేసుకునే ధోరణికి ఆశ్చర్యపడిన జగన్మోహన్ రెడ్డి- దేనికి పోరాటం అవసరమో దేనికి అవసరం లేదో విచక్షణ కలిగి ఉండాలని సూచించారు. కానీ ఆయన మాత్రం గాడితప్పి దేనికోసం పోరాటం అవసరమో.. ఏ విషయంలో సర్దుకుపోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.

వినుకొండ రషీద్ హత్య విషయంలో పోలీసులు తెలుగుదేశానికి చెందిన జలీల్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు జగన్ డిల్లీలొ ధర్నా చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇదేదో శాంతిభద్రతలకు చెందిన వ్యవహారంగా దీక్ష ఆలోచన బాగానే ఉంది.

కానీ.. జగన్ ఢిల్లీ ధర్నా కంటె కూడా ఎక్కువగా తనకు ప్రతిపక్ష హోదా రావడం గురించి ఎక్కువగా ఆరాటపడుతున్నారు. చిన్న చిన్నవిషయాల వద్ద ఆయన పెద్ద పంతానికి పోతున్నారు. నిజానికి ప్రత్యేకహోదా గురించి కూడా ఆయనకు అంత పట్టింపు లేదుగానీ అవసరానికి మించి తనకు ప్రతిపక్ష హోదా మాత్రం కావాలని కోరుకుంటున్నారు.

అందుకోసం స్పీకరుకు లెటరు రాసి.. ఆయన పట్టించుకోకపోవడం వల్ల అభాసు పాలైన జగన్మోహన్ రెడ్డి.. తాజాగా కోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకరును ఆదేశించాలనేది ఆయన పిటిషన్లోని సారాంశం. విచారణకు కోర్టు స్వీకరించింది.

శాంతి భద్రతల విషయంలో ఎంత గట్టిగా పోరాటాలు చేసినా తప్పులేదు. కానీ ప్రతిపక్ష హోదా గురించి ఆయన ఎందుకింత పట్టుబడుతున్నారో తెలియడం లేదు. హైకోర్టుద్వారా అలాంటి గుర్తింపు దక్కుతుందని అనుకోవడం మాత్రమ భ్రమ. పైగా హైకోర్టులో ఆ కేసు నెగ్గకపోతే.. జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధంగానే ఉంటారు గానీ.. అక్కడ కూడా నెగ్గే అవకాశం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకూ జగన్మోహన్ రెడ్డికి కోర్టుకెళ్లడం వంటి సలహాలు ఎందుకిస్తున్నారో.. ఎవరిస్తున్నారో కూడా తెలియడం లేదు. పాత సలహాదారులను మార్చకపోతే.. పరిస్తితి కొత్తగా ఎలా మారుతుందనే భావనలు పార్టీ వారిలోనే వ్యక్తమవుతున్నాయి.



Source link

Related posts

Godavari Express Golden Jubilee: గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు యాభై ఏళ్లు.. గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు

Oknews

ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షకు విస్తృత ఏర్పాట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాలు ఏర్పాటు-amaravati news in telugu appsc group 2 screening exam preparations 1327 centers ready ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ లాసెట్‌ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏఎన్‌‍యూ.. జూన్‌ 9న ప్రవేశ పరీక్ష-ap law cet 2024 notification released by anu entrance exam on 9th june ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment