Top Stories

దేవరలో జాన్వి.. కొరటాల పెద్ద స్కెచ్ వేశాడుగా!


జాన్వి కపూర్ గురించి అందరికీ తెలిసిందే. గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడదు. హాట్ హాట్ ఫొటోషూట్స్ లో ఆరితేరిపోయింది. ఎలాంటి బోల్డ్ లుక్ లోనైనా ఇట్టే ఇమిడిపోతుంది. ఇలా జాన్విని చాలా రకాలుగా, చాలా కోణాల్లో చూపించారు మేకర్స్. కానీ ఎవ్వరూ ఆమెను శ్రీదేవిలా చూపించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కొరటాల ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది.

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వి, బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమాతో జాన్విని కేవలం ఓ హీరోయిన్ గానే కాకుండా, అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల. ఈరోజు రిలీజ్ చేసిన లుక్,  దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది.

దేవర సినిమా నుంచి జాన్వి కపూర్ లుక్ రిలీజైంది. అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిలా లంగావోణీలో కనిపించి ఎట్రాక్ట్ చేసింది జాన్వి. ఆ ఫస్ట్ లుక్ చూస్తుంటే, ఎవరికైనా శ్రీదేవి గుర్తొస్తుంది. కొరటాల కోరుకున్నది కూడా అదే. 'పదహారేళ్ల వయసు'లో శ్రీదేవి గెటప్ కూడా దాదాపు ఇలాంటిదే.

దేవర సినిమాలో జాన్వికపూర్, పక్కా ట్రెడిషనల్ పిల్లగా కనిపించబోతోందనే విషయం తాజా స్టిల్ తో మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. తారక్-జాన్వి మధ్య ఓ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు.

రెండు భాగాలుగా వస్తోంది దేవర. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.



Source link

Related posts

కౌశిక్‌రెడ్డిపై చ‌ర్య‌ల‌కు త‌మిళిసై!

Oknews

పులివెందుల సంగ‌తెందుకు.. కుప్పం కాపాడుకో!

Oknews

గులాబీ తొడిమ మాత్రమే మిగులుతుందా?

Oknews

Leave a Comment