EntertainmentLatest News

‘దేవర’ ఆట.. ‘యమదొంగ’ పాట.. వైరల్‌ అవుతున్న సాంగ్‌!


ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దేవర’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రం ద్వారా అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలోని సెకండ్‌ సాంగ్‌ ‘చుట్టమల్లే’ రిలీజ్‌ అయింది. ఈ పాటకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చాలా కాలం తర్వాత ఒక మంచి మెలోడీ సాంగ్‌ వచ్చిందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. 

ఇదిలా ఉంటే.. చుట్టమల్లే సాంగ్‌ వీడియోకి ఎన్టీఆర్‌ పాత సినిమాలోని ఓ పాటను మిక్స్‌ చేసి ఓ అభిమాని రిలీజ్‌ చేసిన వీడియోను నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ‘యమదొంగ’లోని ‘నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటాను..’ అంటూ సాగే పాట ఆడియోను ‘దేవర’లోని ‘చుట్టమల్లే’ పాట వీడియోకు మిక్స్‌ చేశారు. ఇదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తుంటే అదే ఒరిజినల్‌ సాంగ్‌ అనే ఫీలింగ్‌ అందరికీ కలుగుతోంది. యమదొంగ పాటకు తగ్గట్టుగానే దేవర పాటలో స్టెప్స్‌, మూమెంట్స్‌ ఉండడంతో అందర్నీ ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ‘దేవర’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫియర్‌ సాంగ్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పాట కోసం చేసిన ఫ్యాన్‌ మేడ్‌ వీడియో మాత్రం హల్‌చల్‌ చేస్తోంది. 



Source link

Related posts

Easily follow websites that don’t have RSS feeds

Oknews

braou has extended application deadline for admissions into bed odl programme

Oknews

విడాకులు తీసుకున్న ఆ హీరోయిన్ ని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్!

Oknews

Leave a Comment