EntertainmentLatest News

దేవర నటుడికి అరుదైన వ్యాధి.. అతనికి ఫుల్ హ్యాపీ 


అభిమాని అనే వ్యక్తి ఎంత పవర్ ఫుల్లో ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ హీరోకి మాత్రం బాగా తెలుసు. ఆ  స్థాయి ఎలా ఉంటుందంటే తమ హీరో సినిమాలో నటించే ఆర్టిస్ట్ కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఒక్కసారిగా కంగారు పడిపోయేంతలా. అందులోను యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr) అభిమానులైతే  సోషల్ మీడియా ముందు తిష్ట వేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది.


షైన్ టామ్ చాకో(shine tom chacko)పేరు చూసి  ఏ చైనా, హాలీవుడ్ నటుడో అనుకునేరు.అక్షరాలా భారతీయ నటుడే. కేరళ కి చెందిన టామ్  విలన్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు. ప్రెజంట్ దేవరలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. కథ కి చాలా ముఖ్యమైన రోల్ అని గతంలో మేకర్స్ తెలియచేసారు. కాకపోతే మెయిన్ విలనా వన్ ఆఫ్ ది విలనా అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు ఈ  నటుడు అనారోగ్యం బారిన పడ్డాడు. అటెన్షన్ డెఫిసిటీ హైపర్ యాక్టీవిటీ డిజార్డర్.. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఏడిహెచ్ డి తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి భారిన పడిన వారు ఇతరుల కంటే ప్రత్యేకంగా కనిపించడానికి విపరీతంగా ప్రయత్నిస్తారు. నాకు  పలానా ప్రాబ్లమ్ ఉందని  స్వయంగా టామ్ నే వెల్లడి చేసాడు. పైగా ఈ వ్యాధికి గురయ్యినందుకు తానేం బాధపడటంలేదని దీన్ని పాజిటివ్ క్వాలిటీ గా భావిస్తానని కూడా  చెప్పుకొచ్చాడు.

నాని(nani)హీరోగా వచ్చిన దసరా(dasara)లో  టామ్ విలనిజం ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా విజయానికి కూడా  కారణమయ్యాడు.అదే విధంగా నాగ శౌర్య హీరోగా వచ్చిన రంగబలి లోను సూపర్ పెర్ఫార్మెన్స్  తో మెప్పించాడు. ఇప్పుడు దేవర లో ఏ రేంజ్ లో చేసాడనే  ఆసక్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. అందుకే ఆయన హెల్త్ న్యూస్ వైరల్ గా మారింది. ఇక మొన్న విడుదలైన దేవర రొమాంటిక్ సాంగ్ రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుంది.

 



Source link

Related posts

Nidhi Agarwal latest photos goes viral అందాల నిధిని పట్టించుకోరే..!

Oknews

శ్రీదేవిపై పరువు నష్టం దావా వేసిన ‘కాంతార’ హీరోయిన్‌!

Oknews

ఒక్కడి కోసం లెక్కలేనన్ని వ్యూహాలు!

Oknews

Leave a Comment