EntertainmentLatest News

‘దేవర’ సునామీకి కొత్త ముహూర్తం.. పులి వేట షురూ!


ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ‘దేవర’ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. వీఎఫ్ఎక్స్ వర్క్ మరియు కొన్ని ఇతర కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా కొత్త విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇదొక ఫైట్ సీన్ లో స్టిల్ లా ఉంది. తారక్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దేవర నుంచి గతంలో విడుదలైన పోస్టర్లతో పోలిస్తే.. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ భిన్నంగా ఉంది. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. 

అనిరుధ్ సంగీతం అందిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.



Source link

Related posts

Geetha Madhuri Seemantham Celebrations Video Goes Viral పట్టరాని సంతోషంలో నందు-గీతామాధురి

Oknews

BJP First hundred parliament candidates List Released Today for Elections 2024 | BJP Parliament Candidate List : నేడే వంద మంది బీజేపీ పార్లమెంట్ సభ్యుల తొలి జాబితా

Oknews

Telangana Govt handed over all government schools to women self help groups GO Issued | Telangana News: తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ల మెయింటెనెన్స్ మొత్తం ఇక వారికే

Oknews

Leave a Comment