Andhra Pradesh

‘ధూం ధాం’ టమాటో బుగ్గల పిల్ల.. Great Andhra


చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. “ధూం ధాం” సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’, ‘మాయా సుందరి..’ పాటలు పాట శ్రోతలను అలరించాయి.

ఈ రోజు థర్డ్ సింగిల్ ‘టమాటో బుగ్గల పిల్ల..’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ క్యాచీగా కంపోజ్ చేశారు. శ్రీకృష్ణ, గీతా మాధురి ఆకట్టుకునేలా పాడారు.

‘ఎట్టెట్టగున్నా నువ్వు భల్లేగుంటావే…ఏ మాయో చేసి నన్ను గిల్లేస్తుంటావే..బంగారం గానీ తిన్నావా నువ్వు బబ్లీగా ముద్దొస్తుంటావే.. బంగాళాఖాతం చెల్లెల్లా నన్ను అందంతో ముంచెస్తుంటావే..టమాటో బుగ్గల పిల్ల..’ అంటూ సాగుతుందీ పాట. కలర్ ఫుల్ డ్యూయెట్ గా ‘టమాటో బుగ్గల పిల్ల..’ పాటను రూపొందించారు.

సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.



Source link

Related posts

Chandrababu : 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు

Oknews

Nara lokesh Yuvagalam: ఎల్లుండి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Oknews

Tirumala Brahmotsavam 2023 : నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Oknews

Leave a Comment