Andhra Pradesh

నకిలీ సర్టిఫికేట్లతో 193 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, వాల్తేరు కేవీ ప్రిన్సిపల్ పై సీబీఐ కేసు-visakhapatnam cbi filed case on waltair kendriya vidyalaya principal admission to students with fake certificates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


193 మంది విద్యార్థులకు అక్రమంగా ప్రవేశాలు

2022-23లో 69 మంది విద్యార్థులకు, 2021-22లో 124 మొత్తంగా 193 మందికి నకిలీ ధ్రువపత్రాలతో పాఠశాలలో ప్రవేశాలు కల్పించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మే 3, 4 తేదీల్లో సీబీఐ అధికారులు వాల్తేరు కేంద్రీయ విద్యాలయ స్కూల్ లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రిన్సిపల్‌ శ్రీనివాస రాజా ఫేక్ సర్టిఫికేట్లతో అర్హతలేని విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినట్లు గుర్తించారు. ప్రిన్సిపల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సీబీఐ అధికారులు… విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నగదు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ విషయంపై ఆరా తీసిన సీబీఐ అధికారులు… ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేసింది. కేంద్రీయ విద్యాలయ కమిషనర్‌ నుంచి అనుమతి పొందిన తీసుకున్న ప్రినిపల్ శ్రీనివాస రాజాపై తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.



Source link

Related posts

విరాళాలిచ్చి.. టిక్కెట్లు డిమాండ్… చెక్కులు వాపస్ చేసిన పవన్ కల్యాణ్-pawan kalyan returned the checks of those who had given donations and demanded tickets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Padma Awards 2024 : 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు – చిరంజీవి, వెంకయ్యకు పద్మవిభూషణ్‌

Oknews

AP Budget 2024-25 : అంకెల్లో ఏపీ బడ్జెట్, ఏ పథకానికి ఎంత కేటాయింపు?

Oknews

Leave a Comment