Health Care

నక్షత్రాలను మింగేస్తున్న కాల రంధ్రాలు.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది?


దిశ, ఫీచర్స్ : విశ్వంలో వింత విశేషాలతో పాటు అంతుపట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. నిరంతర పరిశోధనల్లో నిమగ్నమయ్యే ఖగోళ శాస్త్రవేత్తలు ప్రతి సందర్భంలో ఇది రుజువు చేస్తూనే ఉన్నారు. నక్షత్రాలు, సూర్యుడు, భూమి, వివిధ గ్రహాల గురించి ఇప్పటికే మనకు చాలా విషయాలు తెలిసినప్పటికీ, ఇంకా ఏదో ఉందన్న క్యూరియాసిటీ మాత్రం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇదే ఉత్సాహంతో సైంటిస్టులు పరిశోధనలు జరుపుతుంటారు. తాజాగా ఈ విశ్వంలో నక్షత్రాలను మింగుతున్న 18 బ్లాక్ హోల్స్‌ను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

గురుత్వాకర్షణకు మించి..

అంతరిక్షంలో కోట్లాది నక్షత్రాలు ఉంటాయి. అయితే వాటిని చీల్చి, వాటి అవశేషాలను తినే 18 కొత్త బ్లాక్ హోల్స్ ఉనికిని ప్రస్తుతం సైంటిస్టులు కనుగొన్నారు. అంతరాయం కలిగించిన లేదా విడిపోయిన నక్షత్రం నుంచి వెలువడే పదార్థం కాల రంధ్రం చుట్టూ ఒక చదునైన డిస్క్‌ను ఏర్పరుస్తుంది. ఇందులో కొంత బ్లాక్ హోల్ మధ్యలో చేరుతుంది. మిగిలినవి కాంతి-వేగానికి సమీపంలో ఉన్న జెట్స్ మాదిరి బయటకు నెట్టవేయబడతాయి. ఈ ఆవిష్కరణ విశ్వంలో నక్షత్రాల స్వీయ గురుత్వాకర్షణను అధిగమించగలిగే, అలాగే నక్షత్రాలను ముక్కలు చేయగలిగే పరిస్థితిని, అంటే.. టైడల్ డిస్‌రప్షన్ ఈవెంట్స్(TDE) కేసులను రెట్టింపు చేస్తుంది.

టైడల్ డిస్‌రప్షన్

నక్షత్రాలు బ్లాక్ హోల్స్ లేదా రంధ్రాలకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు ‘స్పఘెట్టిఫికేషన్’కు దారితీసే విపరీతమైన గురుత్వాకర్షణ శక్తులను ఎదుర్కొన్నప్పుడు టైడల్ డిస్‌రప్షన్ ఈవెంట్స్ సంభవిస్తాయి. ఈ ప్రక్రియలో నక్షత్రం నిలువుగా విస్తరించి, అడ్డంగా స్క్వాష్ చేయబడుతుంది. ఈ పరిస్థితినే నక్షత్రాలను కాలరంధ్రాలు ధ్వసం చేయడం లేదా మింగేయడం అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఎలా గుర్తించారు?

137 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ NGC 7392 నుంచి ఒక మంటగా కనిపించే, భూమికి అత్యంత దగ్గరగా ఉన్న టైడల్ డిస్ రప్షన్‌ను కనుగొన్న తర్వాత శాస్త్రవేత్తలు కాలరంధ్రాలు, నక్షత్రాలపై తమ అన్వేషణ ప్రారంభించారు. అలాగే నాసాకు చెందిన వైడ్-ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే ఎక్స్‌ప్లోరర్ నుంచి డేటాలో ఇన్‌ఫ్రారెడ్ లైట్, అల్గారిథమ్ ఎనలైజ్డ్ శాంపుల్స్‌ను ఉపయోగించి, వారు 18 రకాల TDE సిగ్నల్స్ ఆవిష్కరణకు దారితీసిన రేడియేషన్ రిలేటెడ్ తాత్కాలిక పేలుళ్లను గుర్తించారు. అలాగే గెలాక్సీలు కూడా ప్రతి 50 వేల సంవత్సరాలకు ఒకసారి టైడల్ డిస్‌రప్షన్ పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.



Source link

Related posts

చిన్న పిల్లల్లో జాండీస్ ఎందుకు వస్తాయి.. అవి ఎప్పుడు ప్రమాదమంటే?

Oknews

ఆ సమయంలో బీట్‌ రూట్ జ్యూస్ తాగవచ్చా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..

Oknews

హోలీకి ఉపయోగించే రంగుల్లో..ఏ కలర్ దేనికి ప్రతీకనో తెలుసా?

Oknews

Leave a Comment