EntertainmentLatest News

నన్ను ఒంటరివాడ్ని చేసి వెళ్లిపోయింది.. వెక్కి వెక్కి ఏడ్చిన నరేష్‌!


నరేష్‌కి ఓ కొత్త కష్టం వచ్చి పడిరది. విహారయాత్రకు వెళితే అది అతనికి విషాద వార్తను మోసుకొచ్చింది. ఆ యాత్రలో అతని బేబీ కనిపించకుండా పోయింది. అందుకే కనిపించిన ప్రతి ఒక్కరికీ తన బేబీ గురించి చెబుతున్నాడు. ఎలాగైనా దాన్ని తన దగ్గరికి తీసుకురమ్మని రిక్వెస్ట్‌ చేస్తూ కంటతడి పెట్టుకుంటున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా కూడా తన బేబీని సెర్చ్‌ చేస్తున్నాడు. ‘కల్కి’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌తోపాటు చిత్ర యూనిట్‌ని కూడా ట్యాగ్‌ చేశాడు నరేష్‌. 

ఎన్నో సంవత్సరాలుగా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న నరేష్‌ ఎప్పుడూ సినిమాలతో బిజీగానే ఉంటాడు. అలాంటిది అకస్మాత్తుగా ట్విట్టర్‌లో ప్రత్యక్షమై ఓ ఎమోషనల్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. దాన్ని పర్టిక్యులర్‌గా ‘కల్కి’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి ట్యాగ్‌ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరచింది. అసలు ఆ వీడియోలో నరేష్‌ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. 

‘హలో నాగ్‌అశ్విన్‌గారు.. మా బేబీ ఎక్కడికో వెళ్లిపోయింది సార్‌. అది లేకుండా మాకు ఒక్క ముద్ద కూడా దిగదు. సడెన్‌గా వదిలేసి వెళ్లిపోయింది. తిరిగాను, అందర్నీ అడిగాను. ‘కల్కి’లో బుజ్జి తెలుసుకానీ, ఈ బేబీ ఎవరో తెలీదంటూ హేళన చేస్తున్నారు సర్‌. మీ బుజ్జి లాంటిదే మా బేబీ కూడా. మీకు మీ బుజ్జి ఎంతో.. మాకు మా బేబీ కూడా అంతే. దయచేసి దాన్ని మా దగ్గరకు చేర్చండి సార్‌. ఈ వీడియో చూస్తున్న వారెవరైనా మా బేబీ కనిపిస్తే తీసుకొచ్చి మాకు అప్పగించండి’ అంటూ దీనంగా అర్థిస్తున్నారు నరేష్‌. 

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. అసలు ఎవరీ బేబీ? అనే డిస్కషన్‌ మొదలైంది. అయితే చివరికి అసలు విషయం తెలిసిపోయింది. ఈరోజుల్లో సినిమా తియ్యడం కంటే దాన్ని జనంలోకి వెళ్లేలా ప్రమోషన్‌ చెయ్యడమే కష్టంతో కూడుకున్న పని. దాని కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. ఈమధ్య ‘కల్కి’ సినిమా కోసం బుజ్జిని ప్రమోట్‌ చేసిన విధానం అందరూ చూశారు. ఇప్పుడు నరేష్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘వీరాంజనేయులు విహారయాత్ర’ కోసం బేబీని రంగంలోకి దించారు. ఈ సినిమా కోసం ఈ వెరైటీ ప్రమోషన్‌ చేశారు. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండే ఓ కుటుంబం విహారయాత్రకు వెళ్లాలని డిసైడ్‌ అవుతుంది. గోవా వెళ్ళేందుకు తమ దగ్గర ఉన్న పాత మెటాడోర్‌ వ్యాన్‌కు రంగులు వేసి ముస్తాబు చేస్తారు. ఈ కుటుంబానికి గోవా యాత్రలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేదే సినిమా. ప్రమోషన్‌ కోసం నరేష్‌ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నాగ్‌అశ్విన్‌ని కూడా ట్యాగ్‌ చెయ్యడంతో నెటిజన్లు, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. 



Source link

Related posts

బిగ్ షాక్.. ప్రముఖ నటి పూనమ్ పాండే కన్నుమూత..!

Oknews

సింహం వేట మొదలైంది.. లఫూట్ అంటూ రెచ్చిపోయిన బాలయ్య!

Oknews

ఫ్యాన్సీ రేటుకు 'లగ్గం' ఆడియో రైట్స్ !

Oknews

Leave a Comment