సెలెబ్రిటీ జాతకాలంటూ సెలబ్రిటీస్ కంటే ఎక్కువగా ఫేమస్ అయిన వేణు స్వామి తరచూ సినిమా ఇండస్ట్రీ వారిపై చేసే జాతకాల కామెంట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందులో నిజం ఉన్నా, లేకపోయినా.. అభిమానులు తమ అభిమానము చూపించే హీరోలు, హీరోయిన్స్ జాతకాలు అంటే తెగ ఇంట్రెస్ట్ చూపించేస్తారు. అలా వేణు స్వామి అనే ఆస్ట్రాలజర్ ఫేమస్ అయ్యి ఇప్పుడు ప్రభాస్ జాతకం బాలేదు, అతనికి పెళ్లి కాదు, అంటూ చెప్పుకుంటూ టాప్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ ఫేమస్ అయ్యేందుకు ట్రై ఉంటాడు.
ఇక విజయ్ దేవరకొండ పై ట్రోల్స్, నెగెటివ్ రివ్యూస్ వల్ల నాశనమైపోయాడు అని చెప్పే వేణు స్వామి విచిత్రంగా హీరోయిన్స్ తో బీర్ బాటిల్స్ పెట్టి పూజలు చేపిస్తాడు. రశ్మికకి అప్పుడెప్పుడో పూజ చేయించాడు ఆమె స్టార్ తిరిగింది అని.. నిధి అగర్వాల్, డింపుల్ లాంటి హీరోయిన్స్ వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు.
ఇప్పుడు వేణు స్వామి కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార పై పడ్డాడు. అంటే నయనతార జాతకంలో అసలు సంతాన యోగమే లేదు, ఆమె అందుకే సరొగసీని ఎన్నుకుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. అసలు నయనతార జాతకంలో సంతాన యోగమే లేదు, అలాంటప్పుడు ఆమెకు కవల పిల్లలు ఎలా పుడతారని ప్రశ్నించిన వేణు స్వామి.. నయనతార పెళ్లి తర్వాత ఇమ్మిడియట్ గా సరోగసి విధానం ద్వారా పిల్లలను కనడానికి ఆమెకున్న సంతాన లోపమే కారణమన్నారు.
తనకి పిల్లలు పుట్టే అవకాసం లేదు కనగానే ఆమె సరోగసీ పద్ధతిని ప్లాన్ చేసుకుందని, సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా, అందరు అనుకున్నట్లుగా గ్లామర్ పాడైపోతుందనేది కారణం కాదంటూ వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో సంచలనం అయ్యింది.