Entertainment

నవంబర్‌ 3 నుంచి కొత్త వెర్షన్‌… రికార్డు సృష్టించిన ‘లియో’


విజయ్‌, లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకొని రూ.540 కోట్లు కలెక్షన్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా మరోసారి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్లీ ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ప్రేక్షకుల కోరిక మేరకు లియో మేకర్స్‌ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ‘లియో’ చిత్రాన్ని నవంబర్‌ 3న మరోసారి రిలీజ్‌ చెయ్యాలని. ఈ సినిమాకి 15 సెన్సార్‌ కట్స్‌ పడ్డాయి. ఆ కట్స్‌ వల్లే ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. అందుకే ఈ సినిమా అందరూ చూసే విధంగా ఉంది. 

ఈ సినిమా రిలీజ్‌ అయిన రోజు నుంచే విజయ్‌ ఒక మాట చెప్తూ వస్తున్నారు. అదేమిటంటే ఈ సినిమాని కట్స్‌ లేకుండా రిలీజ్‌ చేసి ఉంటే బాగుండేది అని. ఫ్యాన్స్‌ కోరికను మన్నించిన మేకర్స్‌ ఎలాంటి సెన్సార్‌ కట్స్‌ లేకుండా ‘లియో’ చిత్రాన్ని విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. నవంబర్‌ 3 నుంచి ఈ సినిమాని సెన్సార్‌ కట్స్‌ లేకుండా ప్రదర్శిస్తారు. అయితే ఈ సినిమాని 18 ఏళ్ళు పైబడినవారు మాత్రమే చూసే అవకాశం ఉంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ‘లియో’ సినిమా మరో అరుదైన రికార్డును క్రియేట్‌ చేసింది. యూకేలో 18 ప్లస్‌ క్లాసిఫికేషన్‌తో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా సెన్సార్‌ కట్స్‌ లేకుండా మరోసారి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఆల్రెడీ సినిమాను చూసిన వారు కూడా ఈ కొత్త వెర్షన్‌ను చూసేందుకు ఎగబడతారు. దాంతో కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. 

 



Source link

Related posts

రజనీకాంత్‌ మేకోవర్‌ లుక్‌.. ఇది నిజమా? గ్రాఫిక్సా?

Oknews

లండన్‌లో ప్రభాస్‌ ఇల్లు.. అద్దె నెలకు ఎన్ని లక్షలో తెలుసా!

Oknews

బాలీవుడ్  కడుపుమంట..తెలుగు డైరెక్టర్స్ మధ్య గొడవపెట్టాలని చూస్తున్నారు!

Oknews

Leave a Comment