నవదీప్.. రెండు దశాబ్దాల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తు వాల్యుబుల్ ఆర్టిస్ట్ గా మారాడు.లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ లో మెరిశాడు. ఇప్పుడు లవ్ మౌళి అనే ఒక పవర్ ఫుల్ మూవీ తో రాబోతున్నాడు.ఆల్రెడీ టీజర్ రికార్డులు సృష్టించే పనిలో ఉంది. తాజాగా నవదీప్ ఒక వీడియో విడుదల చేసాడు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.
రీసెంట్ గా నవదీప్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసాడు. నేను ప్రతి రోజు ఇంటికి వెళ్లి నా ఇనిస్టాగ్రమ్ ఓపెన్ చేస్తే అందులో క్వశ్చన్ ఉంటుంది. అది ఎప్పుడు అని.. దానికి బదులిస్తు చెప్తా రేపు చెప్తా అని అన్నాడు. నవదీప్ అంతటితో ఊరుకోలేదు. తన స్పీచ్ ని కంటిన్యూ చేస్తు నేను చెప్పబోయేది నా పెళ్లి వార్త అయ్యుండొచ్చు లేక లవ్ మౌళి రిలీజ్ డేట్ కూడా అయ్యుండచ్చని అని చెప్పాడు. సరేలే ఎప్పటినుంచో బ్యాచిలర్ కదా పెళ్లి చేసుకుంటున్నాడేమో అని అందరు అనుకున్నారు. కానీ ఆయన చెప్పిన మరో విషయం అందరిలో క్యూరియాసిటీ ని పెంచుతుంది
ఎలక్షన్ లో నేను నిలబడుతున్నాను.. కాబట్టి నామినేషన్ డేట్ కూడా చెప్పచ్చని కాకపోతే అప్పటిదాకా గెస్ చేయండని తన ఫాలోవర్స్ కి చెప్పాడు. పైగా క్యాప్షన్ గా డేట్, డేటెడ్ ,డేటింగ్ అనే పోస్ట్ కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. నవదీప్ ఎలక్షన్స్ లో నిలబడుతున్నాడేమో అని కొందరు అంటున్నారు. అదంతా సినిమాకి సంబంధించిన మ్యాటర్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. మరికొంత మంది మాత్రం ఏదైనా చెప్పు బ్రో.. నీకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు.