టాలీవుడ్ హీరోల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను కలిగిన ఉన్న నటుడు జగపతిబాబు. సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకోవాలని కలలు గల జగపతిబాబుకి మొదట్లో ఎన్నో విమ్శలు ఎదురయ్యాయి. అతనిది హీరో ఫేస్ కాదని, గొంతు అస్సలు బాగా లేదని.. రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాతి కాలంలో ఫ్యామిలీ హీరోగా, రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శోభన్‌బాబు తర్వాత మళ్ళీ అంత ఫాలోయింగ్ ఉన్న హీరో జగపతిబాబు అనిపించుకున్నారు. ఆ తర్వాత అతని కెరీర్ కాస్త నెమ్మదించి విజయాల శాతం తగ్గింది. పదేళ్ళ క్రితం ‘లెజెండ్’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బాబు తన స్టైల్ పూర్తిగా మార్చాడు. ఆ సినిమాలో విలన్‌గా అదరగొట్టేశాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అతని కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు జగపతిబాబు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాబు ఎప్పుడూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అయిపోయింది. కొలంబోలోని ఓ క్యాసినోలో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని స్టైల్‌గా నిలిబడి ఉన్నారు. ‘సిగ్గు శరం లేదని దిగులు పడను. కానీ మీరు చెబితే పడతాను’ అంటూ పోస్ట్ కింద రాసారు. అలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే.. గతంలో క్యాసినోలకు తరచూ వెళ్ళి కొన్ని కోట్లు పోగొట్టుకున్నారు జగపతిబాబు. అలా డిప్రెషన్‌లో ఉన్న ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ ఊపిరి పోసింది. అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ క్యాసినోల చుట్టూ తిరుగుతున్నానని, తనకు సిగ్గు, శరం లేదనే ఉద్దేశంతో ఆ పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జగ్గూభాయ్‌కి మళ్ళీ డబ్బు పోయి ఉంటుందని, అందుకే అలాంటి కామెంట్ పెట్టారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు జగపతిబాబు పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం జగపతిబాబు చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే.. ఇటీవల ‘రుద్రాంగి’, ‘కాటేరా’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ‘సలార్ సీజ్‌ఫైర్’లో రాజమన్నార్ అనే ఓ పవర్‌ఫుల్ రోల్‌లో చాలా డిఫరెంట్‌గా కనిపించారు. రెండో భాగం ‘సలార్ శౌర్యాంగపర్వం’లో జగపతిబాబు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీనితోపాటు ‘రుస్లాన్’ అనే హిందీ సినిమాలో కూడా నటిస్తున్నారు. మరో పాన్ ఇండియా మూవీ ‘కంగువ’ చిత్రంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ పోషిస్తున్నారు జగపతిబాబు.