అన్నదమ్ములు ఎడమొహం, పెడమొహంపరాజయం తర్వాత, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. భూపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి ఇద్దరు కూడా నారాయణఖేడ్ (Narayankhed Politics )నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహారెడ్డి వెంకట్ రెడ్డి కుమారులు. 1972లో నారాయణఖేడ్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిసిన వెంకట్ రెడ్డి, 1983లో తెలుగు దేశం పార్టీలో చేరి, రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన తదనంతరం, తన పెద్ద కుమారుడైన విజయపాల్ రెడ్డి 1994 టీడీపీ టికెట్ పైన పోటీచేసి మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో విజయపాల్ రెడ్డి టీడీపీ టికెట్ పైన పోటీచేయగా, తన తమ్ముడు భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ పైన పోటీచేశారు. కానీ ఇద్దరు కూడా కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల కిష్టా రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2016 కిష్టా రెడ్డి చనిపోవడంతో, ఉప ఉన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టా రెడ్డి కుమారుడు పట్లోళ్ల సంజీవ రెడ్డి పోటీచేసి, బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరొక సారి, టీడీపీ టికెట్ పై పోటీ చేసిన విజయపాల్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.
Source link
previous post