Entertainment

నాసామి రంగ డైరెక్టర్ కి ఘన సన్మానం..నాగార్జున హాజరు 


కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చి  ఘన విజయాన్ని సాధించిన మూవీ నా సామి రంగ. విడుదలైన అన్నిచోట్ల కూడా మంచి కలెక్షన్స్ ని రాబడుతు నాగార్జున కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీల్లో ఒకటిగా కూడా  నా సామిరంగ నిలిచింది .అలాగే నాగార్జున ని వరుస ప్లాప్ ల నుంచి కూడా బయటపడేసిన ఈ మూవీ దర్శకుడుకి ఒక అరుదైన గౌరవం దక్కింది.

నా సామిరంగ కి ప్రముఖ డాన్స్ మాస్టర్ రోజర్ బిన్నీ దర్శకత్వాన్ని వహించాడు. గతంలో ఎన్నో సినిమాలకి డాన్స్ మాస్టర్ గా పని చేసిన విజయ్ కి దర్శకుడుగా నా సామి రంగ నే మొదటిది. ఆ మూవీ ఘన విజయానికి నాగార్జున వన్ మాన్ షో యాక్టింగ్ ఎంత కారణమో విజయ్ బిన్నీ దర్శకత్వం కూడా అంతే కారణం. ఈ సందర్భంగా టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ విజయ్ ని ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి పలువురు డ్యాన్స్ మాస్టర్స్ తో పాటు నాగార్జున, అల్లరి నరేష్, నిర్మాత శ్రీనివాస చిట్టూరి లు కూడా హాజరయ్యారు. 

 నా సామిరంగ ని విజయ్ ఎంతో కష్టపడి తెరకెక్కించాడని  ప్రతి ఫ్రేములోను ఆ విషయం అర్ధం అవుతుందని నాగ్ చెప్పాడు. అలాగే  ప్రేక్షకులు  తమ సినిమాని  ఆదరిస్తుండడం కూడా  ఎంతో ఆనందంగా ఉందని కూడా ఆయన చెప్పాడు. జనవరి 14 న విడుదలైన  నా సామి రంగ ఇప్పటికి మంచి కలెక్షన్స్ ని సాధిస్తు ముందుకు దూసుకువెళ్తుంది. ఈ మూవీలో ఆషికా రంగనాథ్ నాగ్ తో జత కట్టింది.ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందించాడు.

 



Source link

Related posts

విజయ్ గోట్  తెలుగు రిలీజ్ ఎంతకీ కొన్నారో తెలుసా! 

Oknews

విశ్వక్ సేన్ 'గామి' ట్రైలర్.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!

Oknews

ఓటీటీలోకి నందమూరి హీరో మూవీ.. ఆహా అనాల్సిందే!

Oknews

Leave a Comment