మహాభారతంలో శ్రీ కృష్ణుడు గా చేసి అఖండ భారతావని కళ్ళల్లో నేటికీ శ్రీ కృష్ణుడు గా కొలువుతీరిన నటుడు నితీష్ భరద్వాజ్.ప్రెజంట్ ఎంత మంది కృష్ణులు వచ్చినా కూడా నితీష్ యొక్క సమ్మోహన రూపం ఇంకా చాలా మంది భారతీయుల మస్తిష్కం నుంచి పోలేదు. తాజాగా ఆయనకి సంబంధించిన న్యూస్ ఒకటి ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
నితీష్ రీసెంట్ గా తన భార్య మీద పోలీసు కేసు నమోదు చేసాడు.నా పిల్లలని నన్ను కలవనీయకుండా నా భార్య నన్ను మానసికంగా వేధిస్తుందని భూపాల్ ఎస్పి కి ఫిర్యాదు చేసాడు. నితీష్ భార్య పేరు స్మిత. వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొన్నాళ్లపాటు వాళ్ళ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత ఇద్దరు 2019 లో విడాకులకి అప్లై చేసారు. 2022 లో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. నితీష్ స్మితలకి ఇద్దరు కవలల ఆడపిల్లలు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. స్మిత ఐఏఎస్ రేంజ్ అధికారి.
1988 లో దూరదర్శన్ లో టెలికాస్ట్ అయిన మహా భారతం ద్వారా నితీష్ చాలా ప్రజాదరణని పొందాడు. మహాభారతం అనే వాయిస్ వినపడటం ఆలస్యం జనం టీవీల దగ్గరకి పరిగెత్తుకుంటు వెళ్ళేవాళ్ళు.నితీష్ సుమారు హిందీ, మరాఠీ భాషల్లో కలిపి సుమారు 17 సినిమాలకి పైగానే చేసాడు. అలాగే కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించడంతో పాటు 1996 నుంచి 98 దాకా ఎంపి గా కూడా పని చేసాడు.