EntertainmentLatest News

నా సామి రంగ.. నాగార్జున హిట్ కొట్టాడు


ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ సినిమాలు విడుదలయ్యాయి. ‘హనుమాన్’ సినిమా సంచలన వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకోగా, ‘గుంటూరు కారం’ డివైడ్ టాక్ తో కూడా రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టి పరవాలేదు అనిపించుకుంది. ‘సైంధవ్’ మాత్రం పూర్తిగా వెనకపడిపోయింది. ఇక ‘నా సామి రంగ’ సైలెంట్ గా హిట్ కొట్టేసింది.

రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ‘నా సామి రంగ’ మూవీ.. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకుంది. మొదటి వారం నైజాంలో రూ.4.45 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.3.34 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.9.71 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో రూ.17.50 కోట్ల షేర్ సాధించింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.65 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.52 లక్షల షేర్ కలిపి.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.18.67 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.20 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. మొత్తానికి ‘నా సామి రంగ’ రూపంలో నాగార్జున ఖాతాలో మరో సంక్రాంతి హిట్ చేరింది.



Source link

Related posts

సమంత  అమెరికాలో అవి తింటుందా? 

Oknews

Huge competition for the Khammam Congress MP ticket | Khammam Congress MP Ticket: ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ల వార్

Oknews

What happens when Kajal comes back కాజల్ కమ్ బ్యాక్ ఏమవుతుందో..

Oknews

Leave a Comment