EntertainmentLatest News

నిజమైన పులి తో నటించిన కామెడీ ఆర్టిస్టు..హీరోగా ఆయనకి మొదటి సినిమా 


కమెడియన్ గా సినిమా రంగంలోకి ప్రవేశించి   హీరోలుగా రాణించిన  వారు భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు.ఇప్పుడు ఈ కోవలో వెండి తెర మీద మీద తన హీరోయిజానికి ఉన్న అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక కమెడియన్ రెడీ అయ్యాడు. తాజాగా ఈయన తన సినిమాకి సంబంధించి  రియల్ గా చేసిన సాహసం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

తమిళ చిత్రరంగంలో ఉన్న ఫేమస్ కమెడియన్స్ లో పుగళ్ కూడా ఒకరు.ఇతను చేసే కామెడీ కి తమిళనాడులో మంచి గిరాకీ ఉంది. తాజాగా ఈయన  మిస్టర్ జూ కీపర్ అనే చిత్రంలో నటించాడు. నటించాడు అంటే కామెడీ క్యారక్టర్ అనుకునేరు హీరోగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. పైగా పుగళ్ కి హీరోగా జూ కీపర్ నే  మొదటి సినిమా. ఆ  సినిమా కథ యొక్క డిమాండ్ దృష్ట్యా పుగళ్ నిజమైన పులితో యాక్ట్ చెయ్యాలి. మొదట అలా నటించడానికి భయపడ్డ పుగళ్ ఆ తర్వాత పులిని మచ్చిక చేసుకొని నటించాడు. ఈ విషయాన్ని పుగళ్ తాజాగా జరిగిన జూ కీపర్ సినిమా ఫంక్షన్ లో చెప్పాడు.

4 జె స్టూడియోస్ పతాకంపై రాజా తంత్రం, జబా జాన్,లు  మిస్టర్ జూ కీపర్ ని నిర్మించగా షెర్లిన్ కాంచాలా పుగళ్ తో జత కట్టింది. సురేష్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో తెరకెక్కిన  జూ కీపర్  అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అందుకు సంబంధించిన తేదీని కూడా మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.



Source link

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మహేష్ బాబు..?

Oknews

Telangana Govt announces relief of 10 thousand Rupees per acre to farmers affected by crop loss due rains Jupally Krishna Rao | Telangana: ఆ రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం

Oknews

వైరల్ అవుతున్న గుణశేఖర్.. నీ సినిమాలో హీరో గురించి చెప్పకపోవడం ఏంటి

Oknews

Leave a Comment