ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన నటీమణి సమంత. పాత్ర ఏదైనా సరే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లడం ఆమె స్పెషాలిటీ. ఎన్నో చిత్రాల్లో అధ్బుతంగా నటించి తన కంటు ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా ఆమె సంపాదించింది. తాజాగా ఆమె తన మాజీ భర్త నాగ చైతన్య గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చెయ్యడం సంచలనం సృష్టిస్తుంది.
సమంత రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు నా ఇష్టా ఇష్టాలని గుర్తించడంలో విఫలమయ్యానని దాని వల్ల నేను లైఫ్ లో అతి పెద్ద తప్పు చేసానని చెప్పింది. అంతటితో ఆగకుండా నా జీవిత భాగస్వామి నా ఇష్టాలని చాలా ప్రభావితం చేసాడు.ఈ విషయాన్ని గుర్తించడానికి తనకి చాలా సమయం పట్టిందని కూడా ఆమె చెప్పింది. ఇప్పుడు సమంత చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
నాగ చైతన్య సమంత ల మధ్య ఏ మాయ చేసావే సినిమా సమయంలో ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత ఇరువైపు పెద్దలని ఒప్పించి 2017 లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో 2021లో విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం సినిమా రంగంలో కొత్త వారిని ప్రోత్సాహించడానికి ట్రలాలా మూవీ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ని స్థాపించింది. ఆమె గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.