Telangana

నిజామాబాద్‌ కేంద్రీయ విద్యాలయ నూతన భవనం, వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ-nizamabad news in telugu kendriya vidyalaya new building pm modi started virtually ,తెలంగాణ న్యూస్



Nizamabad Kendriya Vidyalaya : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో మినీ ట్యాంక్ బండ్ ను అనుకుని నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ(Nizamabad Kendriya Vidyalaya) భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా మంగళవారం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలోని ఐ.ఐ.ఎం నుంచి వర్చువల్ విధానం ద్వారా కేంద్రీయ విద్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind), ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా విస్తరిస్తోందన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలోనే కేంద్రీయ విద్యాలయాలు ఉండేవని అన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లా కేంద్రంతో పాటు బోధన్, మిర్యాలగూడ, మహబూబాబాద్, సిరిసిల్ల వంటి అనేక పట్టణాల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు.



Source link

Related posts

మెదక్ జిల్లాలో దారుణం, చున్నీతో తండ్రికి ఉరేసి హత్య చేసిన కొడుకు-medak crime news son killed father due to family disputes ,తెలంగాణ న్యూస్

Oknews

BRS MLC Kalvakuntla Kavitha Expresses Objection To The Behavior Of Telangana Police | Kalvakuntla Kavitha: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? యువతి జుట్టుపట్టి ఈడ్చుతారా?

Oknews

Govt Scheme all details about yojana lakhpati didi yojana in telugu

Oknews

Leave a Comment