Health Care

నిమ్మకాయను అధికంగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవట!


దిశ, ఫీచర్స్: సాధారణంగా మనలో చాలా మంది అందం నుండి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం వరకు అన్నింటికీ నిమ్మకాయలను ఉపయోగిస్తారు.ఎందుకంటే నిమ్మకాయ మన ఆరోగ్యానికి అంత మంచిది. అయితే దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అంతే విధంగా నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయ వల్ల లాభా, నష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం

నిమ్మకాయలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరస్తుంది. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలోని ఎసిడిటీ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. వైరస్, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పని చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నిమ్మకాయ వల్ల కలిగే నష్టాలు ఇవే..

నిమ్మకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని అధిక వినియోగం దంత క్షయానికి దారితీస్తుంది. పంటి ఎనామిల్ కూడా పోతుంది. నిమ్మకాయలు పళ్లతో పాటు జీర్ణక్రియ సమస్యలను కూడా కలిగిస్తాయి. గ్యాస్ సమస్యలు ఉన్న వారు నిమ్మకాయను తీసుకుంటే, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుంది. నిమ్మకాయలో ఉన్న పొటాషియం హార్ట్ బీట్ రేటును కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 



Source link

Related posts

JAM 2024 పరీక్ష తేది ఎప్పుడో తెలుసా.. మార్గదర్శకాలు ఇవే ..

Oknews

మీకు తెలుసా.. బ్రాందీ తాగితే ఆ వ్యాధి తగ్గుతుందంట!

Oknews

కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Oknews

Leave a Comment