EntertainmentLatest News

నిరాడంబరంగా విక్టరీ వెంకటేష్‌ రెండో కుమార్తె వివాహం!


విక్టరీ వెంకటేష్‌ రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం మార్చి 15 రాత్రి గం.9.36లకు రామానాయుడు స్టూడియో వేదికగా జరిగింది. ఈ వేడుకను కేవలం తమ కుటుంబ సభ్యులకే పరిమితం చేశారు వెంకటేష్‌. దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. విజయవాడకి చెందిన డాక్టర్‌ పాతూరి వెంకటేశ్వరరావు, డా అరుణల కుమారుడు నిశాంత్‌తో హవ్యవాహిని వివాహం జరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దానికి చిరంజీవి, మహేష్‌ బాబు, నాగచైతన్య వంటి కొందరు సెలబ్రిటీలు సందడి చేశారు. అయితే వివాహాన్ని మాత్రం చాలా సింపుల్‌గా చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించి మీడియాకు రెండు ఫోటోలను మాత్రమే విడుదల చేశారు. 

మూవీమొఘల్‌ డా.డి.రామానాయుడు రెండో కుమారుడైన వెంకటేష్‌, నీరజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. 2019లో పెద్ద కుమార్తె వివాహం జరిగింది. ఇప్పుడు రెండో కుమార్తె పెళ్ళి చేసారు. మరో అమ్మాయి పెళ్ళి చెయ్యాల్సి ఉంది. ఇక కుమారుడు అర్జున్‌ను తన వారసుడుగా టాలీవుడ్‌కి హీరోగా పరిచయం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 



Source link

Related posts

Gold Silver Prices Today 17 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: ఈ పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి మహా భారం

Oknews

సైలెంట్ గా వచ్చేసిన సత్యభామ.. ఏం చేస్తుందో..!

Oknews

Kalvakuntla Kavitha accuses CM Revanth reddy that he joins with BJP | Kavitha Comments: రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారు

Oknews

Leave a Comment