చైతన్య జొన్నలగడ్డ తో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తన కొత్త జీవితాన్ని ఎలా క్రియేట్
చేసుకుంటుంది అని మెగా అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంది. వాళ్ళ ఆశలకి తగ్గట్టే నిహారిక ఒక నటిగా ఫుల్ బిజీ అవ్వాలనే లక్ష్యంగా కొన్ని కథలని కూడా వింది. ఆల్రెడీ తాను మంచి నటి అని కొన్ని సినిమాల ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా నిహారిక ప్రూఫ్ చేసుకుంది. అందానికి అందం పైగా మెగా డాటర్ అలాగే మెగా ఫాన్స్ అండదండలు తనకి ఎలాగూ ఉంటాయి కాబట్టి
తాను ఎంచుకున్న సినిమా లు బాగుంటే ఇండస్ట్రీ లో నిహారికకు ఎదురుండదు.
ఇంక తాజాగా సోషల్ మీడియా లో నీహారిక పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం కాకలు రేపుతోంది. రెండు వారాల క్రితం రెస్ట్ కోసం ఫారెన్ వెళ్లి హైదరాబాద్ వచ్చిన నీహారిక ప్రస్తుతం తన అన్నయ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్ళికి సంబంచిన పనుల్లో ఫుల్ బిజీ గా ఉంది. ఇంత బిజీ లో కూడా నీహారిక పోస్ట్ చేసిన పిక్ యువతరం మతుల్ని పోగొట్టింది. ఆరంజ్ కలర్ టీ షర్ట్ తో దుండిని తన ఒడిలో పెట్టుకొని కళ్ళతో ఏదో చెప్పాలనుకుంటున్న దానిలా నిహారిక ఎక్సప్రెషన్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా లో నీహారిక పిక్ ని చూసిన నెటిజన్స్ నీహారిక ఏదో దాస్తుందని తన కళ్ళలో అదంతా కనపడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నీహారిక పిక్ వైరల్ అవుతుంది.