అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘పుష్ప2’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఫస్ట్ పార్ట్‌ని మించే స్థాయిలో సెకండ్ పార్ట్‌ని ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు సుకుమార్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు కూడా విడుదలై టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారం ప్రారంభం కాబోతోంది. ఈనెలాఖరు వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. అల్లు అర్జున్ కూడా నెలాఖరు వరకు షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.