AP Inter Hall Tickets : నేటి ఇంటర్ హాల్ టికెట్లు(AP Inter Hall Tickets) విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఏపీలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1559 సెంటర్లను సిద్ధం చేసింది. పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాజరును ఆన్ లైన్ లో నమోదుచేసేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. గత ఏడాది పరీక్ష పేపర్ల లీక్ (Paper Leak)వివాదంతో ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్‌ను జతచేసింది. దీంతో ప్రశ్నాపత్రాన్ని ఎక్కడైనా ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసే విధంగా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను నిషేధించారు. ఈ ఏడాది 10,52,221 మంది ఇంటర్ పరీక్షలకు(AP Inter Exams) ఫీజు చెల్లించారు. వీరిలో 4,73,058 మంది ఫస్టియర్, 5,79,163 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ పరీక్ష పేపర్లను స్థానిక పోలీస్ స్టేషన్ లో భద్రపరచనున్నారు.