మెయింటైనెన్స్ పనుల కోసం నగరంలో కరెంటు కోతలుమెయింటినెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగల పైకి పెరిగిన చెట్లను తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్త వాటిని వేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ అలీ షారుక్కి తెలిపారు. విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పినంత మాత్రాన రోజువారి కోతలు ఉండవని ఒక్కో ఫీడర్ ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3000 బెస్ ఫీడర్లు ఉన్నాయని …..నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు (ఆదివారాలు, పండుగలు మినహా) 10 నిమిషాల నుంచి రెండు గంటల వరకు విద్యుత్ నిలిపి వేసి నిర్వహణ పనులను పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. నిర్వాహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన పూర్తి వివరాలను http://tssouthernpower.com వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తామన్నారు.
Source link
previous post