EntertainmentLatest News

నేను అమ్మాయిల వెంట తిరగడానికి వాళ్లే  కారణం 


హ్యాపీ డేస్,కొత్త బంగారులోకంతో వరుణ్ సందేశ్ (varun sandesh)యువ ప్రేక్షకుల హృదయాలో చాలా బలమైన ముద్ర వేసాడు. ఆ సినిమాల ద్వారా వచ్చిన  లవర్ బాయ్  ఇమేజ్ తో ఎక్కువగా  లవ్ మూవీస్ నే చేసాడు. కానీ వరుస పరాజయాలు చుట్టు ముట్టాయి. దీంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు నింద (nindha)అంటు రాబోతున్నాడు.ఈ సందర్భంగా  చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా మారాయి.

దర్శక నిర్మాతలు నా దగ్గరకి వచ్చేటప్పుడు ప్రేమ కథలతో  వచ్చేవారు. దాంతో ప్రేక్షకులు అమ్మాయిల వెంట తిరిగే లవర్ బాయ్ గానే నన్ను ఉహించుకొని మూవీకి  వచ్చేవారు.నాకు కూడా  ఎప్పుడు అదే రకమైన పాత్రలు పోషిస్తూ ఉండటం వలన అసంతృప్తి గా అనిపించేది. పైగా కథ చెప్పేటప్పుడు ఒకలా చెప్తారు.కానీ  తెర మీద ఇంకోలా తెరకెక్కుతాయి. దాంతో అసలు నేనేం చేస్తున్నాను అని ఉహించుకొని సినిమాలు ఆపి  అమెరికా కి వెళ్ళిపోయా. ఏడాదిన్నర తర్వాత మళ్ళి సినిమా చేయాలనీ వచ్చా. ఆ సమయంలో నింద కథ నా దగ్గరకి వచ్చింది. నిజానికి ఇలాంటి కథలనే నేను ఇష్టపడతాను. నా గత చిత్రాలకి సంబంధించిన ఛాయలు ఈ మూవీలోకనిపించవు. ఇన్నాళ్లకి నాకు నచ్చిన కథ దొరికిందని చెప్పాడు.

 ఇక నింద  సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతుంది. ఈ టైపు సినిమాలు గతంలో వచ్చినా కూడా ఒక సరికొత్త స్క్రీన్ ప్లే తో వస్తుందనే విషయం ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.  విచిత్రం ఏంటంటే ఈ మూవీ  క్లైమాక్స్ ని ఆర్టిస్టులు  ఎవరకి చెప్పకుండా షూట్ చేసారు. వరుణ్ సందేశ్ తో పాటు తనికెళ్ల భరణి, భద్రం, అన్నే జిబి, శ్రేయ రాణి రెడ్డి, సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాజేష్ జగన్నాధం (rajesh jagannadham) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది.ఓంకార్ సంగీతాన్ని అందించగా రమీజ్ కెమెరామెన్.  ఈ నెల 21 న విడుదల కాబోతుంది.

 



Source link

Related posts

అరెస్ట్ వార్తలపై వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్

Oknews

Two Days Collections Of Ooru Peru Bhairavakona టాక్ కి కలెక్షన్స్ కి పొంతనే లేదు

Oknews

ఇదెక్కడి ట్విస్ట్ దిల్ మావ.. రౌడీ బాయ్స్ మళ్ళీనా..!

Oknews

Leave a Comment