EntertainmentLatest News

నేను పట్టుకుంటే తుపాకీ కే దైర్యం వస్తుంది. హ్యాపీ బర్త్ డే మేడం


 

హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ని సంపాదించిన హీరోయిన్ విజయశాంతి(vijayashanthi)అందుకే  లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు తనంతట తానుగా వచ్చి వరించింది. దాదాపుగా అందరకి అగ్ర హీరోలతో చేసి కొన్ని లక్షలాది మంది అభిమానులని సంపాదించింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి నటనలో తన సత్తా చాటలేదని నిరూపిస్తుంది. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె అప్ కమింగ్ మూవీ నుంచి ఒక వీడియో రిలీజ్ అయ్యింది 

విజయశాంతి  ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్(kalyan ram) హీరోగా తెరకెక్కుతున్న కొత్త  మూవీలో చేస్తుంది.ఆమె పుట్టిన రోజు  సందర్భంగా విషెస్ చెప్తు మేకర్స్  ఒక వీడియోని రిలీజ్ చేసారు. వైజయంతి ఐపీఎస్ అనే క్యారక్టర్ లో విజయ శాంతి మెరవబోతుంది. కళ్యాణ్ రామ్ వాయిస్ ఓవర్ ద్వారా తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి దైర్యం వస్తుంది. యూనిఫామ్ కి పౌరుషం వస్తుంది.తనే ఒక యుద్ధం.నేనే ఆమె సైన్యం అని చెప్పించడం చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి పోలీసు ఆఫీసర్ గా కనపడుతుంది.

సినిమాల్లో హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫైట్స్‌లోనూ, డాన్స్‌లోనూ, అవినీతి పరుల ఆట కట్టించడంలోనూ హీరో ప్రధాన పాత్ర పోషిస్తుంటాడు. అలాంటి సినిమాలు రూపొందుతున్న తరుణంలో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ లెక్కకు మించి చేయడం ద్వారా ఆ జోనర్‌ సినిమాల్లో విజయశాంతి  ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు లేడీ  ఆరోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ వంటి స్టార్‌ హీరోలు విజయశాంతి డేట్స్‌ కోసం ఎదురుచూసేవారంటే ఆ కాంబినేషన్‌కి ఎంత క్రేజ్‌ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చెయ్యాలంటే  విజయశాంతి తప్ప మరో ఆప్షన్‌ లేదు. 

 



Source link

Related posts

Latest Update on Pushpa 2 Shooting పుష్ప 2 షూటింగ్‌పై గుడ్ న్యూస్

Oknews

రాజ్ తరుణ్ కేసులో మరో సంచలనం.. హీరోయిన్ పై హత్యాయత్నం.. మూడు కత్తి పోట్లు…

Oknews

నీకసలు బుద్ధి ఉందా.. కల్కి విషయంలో గొడవపడ్డ విశ్వక్ సేన్

Oknews

Leave a Comment