కర్ణుడికి కవచకుండలాలు ఎలానో ఒక హీరోకి అభిమానులు కూడా అలానే. స్టార్ డం వచ్చాక అభిమానుల కోసమే సినిమా చెయ్యాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదే టైం లో తమ హీరో మూవీకి ది బెస్ట్ టెక్నీషియన్స్ పని చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.ఆ స్థాయిలో ఫ్యాన్స్ అప్ డేట్ అయ్యారు. అలాంటిది నేను పలానా సినిమా చెయ్యడంలేదని స్వయంగా హీరోనే చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
రెండు దశాబ్దాల పై నుంచే తెలుగు ,తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ కలిగిన హీరో సూర్య. తాజాగా ట్విట్టర్ వేదికగా తన కొత్త మూవీని ఆపేస్తున్నటుగా ప్రకటించాడు.కొన్ని రోజుల క్రితం హిట్ చిత్రాల దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో పూరణనూరు అనే సినిమాని సూర్య స్టార్ట్ చేసాడు. ఇప్పుడు ఈ సినిమానే నిలిపివేస్తునట్టుగా చెప్పాడు. పూరణనూరు చాలా ప్రత్యేకమైన మూవీ. కథ మా హృదయాలకి ఎంతో దగ్గరైంది. అందుకే ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి ది బెస్ట్ ఇవ్వడం కోసమే ఆపేస్తున్నటుగా చెప్పాడు. ఈ విషయం సూర్య అభిమానుల్ని నిరాశకి గురి చేసింది. సుధా సూర్య కాంబోలో సురారు పోట్రు అనే మూవీ వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇదే మూవీ తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో వచ్చింది.
సూర్య ప్రస్తుతం చేస్తున్న పీరియాడిక్ మూవీ కంగువ ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది.సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కితుంది. ఇంతకు ముందు సూర్య వెట్రిమారన్ కాంబోలో రావాల్సిన వాడి వాసిల్ కూడా నిలిచిపోయింది.