ప్రకాష్ రాజ్ (prakash raj)మంచి నటుడు..ఈ విషయాన్ని మనలోనే ఉంచుకోవాలి. పొరపాటున ఎవరితో అయినా చెప్తే ఒక్కసారి ఎగా దిగాగా చూస్తారు. ఎందుకంటే ఆ విషయం మాకు తెలియదా అని. ఒకటి కాదు రెండు కాదు మూడున్నర దశాబ్దాలుగా ఇండియన్ సినిమా సిల్వర్ స్క్రీన్ వద్ద తన సత్తా చాటుతూ వస్తున్నాడు. తాజాగా హీరో ధనుష్ గురించి కొన్ని మాటలు మాట్లాడాడు. ఇప్పుడు అవి వైరల్ గా నిలుస్తున్నాయి.
ధనుష్(dhanush)నయా ప్రాజక్ట్ రాయన్. దర్శకుడు కూడా ధనుష్ నే. ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పేరులోనే వైవిధ్యాన్ని కనపరుస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఈ నెల 26 న విడుదల కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా తెలుగు నాట ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఇందులో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతు ధనుష్ తన మొదటి సినిమా నుంచి ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెడుతు వస్తున్నాడు. అందుకే నేడు నెంబర్ వన్ గా ఉన్నాడు. ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చూసిన ధనుష్ వేరు.మొదటి సినిమా అప్పుడు చాలా బక్కగా ఉండేవాడు. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పది కేజీల మాంసం, ఇరవై కేజీల ఎముకలు పెట్టుకొని ఏం చేస్తావు అని విలన్ హోదాలో ధనుష్ ని అడుగుతాను. కానీ ఈ ఇరవై ఏళ్లలో ధనుష్ వల్ల సినిమాకే అందం, గౌరవం వచ్చింది.చిన్న నటుడిగా వచ్చి సింగర్ గా, రైటర్ గా,నిర్మాతగా, దర్శకుడిగా ఎదగటం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకొచ్చాడు.
అదే విధంగా ఒక డైరెక్టర్ గా తన నుంచి ఎలాంటి నటనని రాబట్టాడో అనే విషయాన్నీ కూడా చెప్పాడు. నేను సెట్ లోకి వెళ్లగానే మీరు మంచి నటుడు అని నాకు తెలుసు. కానీ మీ ప్రతిభ ,అనుభవం నాకు కావాలి. రెగ్యులర్ నటన నాకొద్దని తనలో దాగి ఉన్న ఒక కొత్త నటుడిని రాయన్ ద్వారా పరిచయం చేయబోతున్నాడని కూడా ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు అలాగే . ధనుష్ కేవలం నటుడే కాదు అని ప్రస్తుత జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అని కూడా కొనియాడాడు.