Health Care

పదే పదే పొత్తికడుపులో నొప్పి వస్తుందా.. కారణం ఇదే!


దిశ, ఫీచర్స్ : పొత్తికడుపులో నొప్పి అనేది చాలా సహజం. అయితే ఇది కొన్నిసార్లు కామన్‌గా ఉండొచ్చు, కానీ ఇది అధికమైతే మన జీవితాన్ని అనేక సమస్యల్లోకి నెట్టేసే అవకాశం ఉన్నదంటున్నారు వైద్యులు. పొత్తికడుపు నొప్పి అనేది అనేక రకాల సమస్యల వలన వస్తుందంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పొత్తి కడుపు నొప్పి అనేది క్యాన్సర్‌కు సంకేతం అంటున్నారు వైద్యులు. కొన్ని రకాల క్యాన్సర్స్ పొత్తికడుపులో నొప్పిని కలుగజేస్తాయంట. అందువలన ఈ నొప్పి అనేది పదే పదే రావడం, గంటల తరబడి నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలంట.

2. అపెండిక్స్ అనేది కామన్ సమస్య. పెద్ద పేగులో ఉండే చిన్న సన్ని గొట్టం ఎర్రబడినప్పుడు ఈ సమస్య వస్తుంది. అయితే ఈ అపెండిక్స్ సమస్య ఉన్నప్పుడు కూడా పొత్తికడుపులో నొప్పి వస్తుందంట.

3. ప్రస్తుతం చాలా మంది యూత్, వృద్ధులను అధికంగా వేధిస్తున్న సమస్య మలబద్ధకం. ఈ సమస్య ఉన్నవారికి కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తుందంట.

4. గ్యాస్ , అసిడిటీ సమస్యలకు పొత్తికడుపు నొప్పి కూడా కారణం కావచ్చునంట.గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ అని పిలిచే యాసిడ్ రిఫ్లక్స్, కడుపు ఆమ్లాలు మీ గొంతును, కడుపుతో కలిపే భాగంలోకి వచ్చినప్పుడు వస్తుంది. దీని కారణంగా ఛాతీ, గొంతులో మంటగా అనిపిస్తుంది.

5. అలాగే కొంత మంది మహిళల్లో గర్భాశయ సమస్యలు, నీటి బుడగలు లాంటివి ఉండటం, పీసీఓడీ లాంటి సమస్యలు ఉన్నవారిలో కూడా పొత్తికడుపులో నొప్పివస్తుందంట.



Source link

Related posts

ఎనర్జీని పెంచే డ్రాగన్ ఫ్రూట్.. వారానికి ఒక్కటి తిన్నా ఆ సమస్యలన్నీ పరార్!

Oknews

ఇంట్లోనే ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఎంత ఫిట్‌గా ఉన్నారో తెలుసుకోవచ్చు…

Oknews

AIIMSలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Oknews

Leave a Comment