Uncategorized

పర్చూరు ఓట్ల తొలగింపులో జోక్యం, నలుగురు పోలీసులపై వేటు!-bapatla parchur mla sambasiva rao complaint on voter deletion ec suspended four police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Votes Deleted Issue : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఓట్ల తొలగింపులో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై చర్యలు తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం, బాపట్ల ఎస్పీని నివేదిక కోరింది. ఎస్పీ నివేదికతో ఓట్ల తొలగింపులో జోక్యం చేసుకున్న మార్టూరు సీఐ, ఎస్సై, పర్చూరు, యద్దనపూడి ఎస్సైలను సస్పెండ్ చేస్తూ సీఈవో ముకేశ్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఓట్ల తొలగింపుతో సంబంధం ఉన్న బీఎల్వోలు, మహిళా పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఈవో చర్యలు తీసుకున్నారు.



Source link

Related posts

TTD Donations: టీటీడీ అన్నదానానికి ఒక రోజు విరాళం ఇవ్వడం ఎలా అంటే?

Oknews

Attack On APSRTC Driver: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్‌

Oknews

Janasena Varahi Yatra 4th Phase : ఇవాళ్టి నుంచి పవన్ ‘వారాహి యాత్ర’

Oknews

Leave a Comment