EntertainmentLatest News

పవన్ కళ్యాణ్ ఉయ్యాల పిక్ వైరల్ 


వరల్డ్ వైడ్ గా ఉన్న పవర్ స్టార్ అభిమానుల దగ్గరకెళ్ళి మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరని అడగండి. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే హరీష్ శంకర్ అని చెప్తారు. ఎందుకంటే పవన్(pawan kalyan)కి  గబ్బర్ సింగ్ (gabbar singh)మూవీతో హిట్ ఇచ్చి  పరాజయాల నుంచి విముక్తి కల్పించాడు. పైగా అది అల్లాటప్పా విజయం కాదు.సౌత్ సినీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ రికార్డ్స్ ఇంకా ఫ్యాన్స్ కళ్ళ ముందు  మెదులుతూనే ఉన్నాయి. పైగా పవన్  డైలాగ్స్ మేనరిజమ్స్ ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి. ఇక  తాజాగా హరీష్  ఒక పిక్ ని షేర్ చేసాడు. ఇప్పుడు అది ట్రెండింగ్ లో బిజీగా ఉంది  

పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలు మూడు. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్( ustaad bhagat singh)ఇందులో ఉస్తాద్ కి హరీష్ శంకర్ దర్శకుడు. ఇందులో  పవన్ మరో మారు  పోలీసు ఆఫీసర్ గా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నాడు. శ్రీలీల (sreeleela)హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే ఉస్తాద్  నుండి వచ్చిన చిన్నపాటి  టీజర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.ముఖ్యంగా డైలాగ్స్ అయితే ఒక రేంజ్ లో మారుమోగిపోతున్నాయి. ఇక శ్రీలీల బర్త్ డే సందర్భంగా  మూవీకి సంబంధించిన వర్కింగ్  స్టిల్ ఒకదాన్ని హరీష్  రిలీజ్ చేసాడు. ఒక పొడవాటి ఉయ్యాలా మీద శ్రీలీల కూర్చొని ఉంది.  చేతిలో టీ కప్పు ఉంది. హరీష్ ఆమె పక్కనే కూర్చొని సీన్ గురించి సలహా ఇస్తున్నాడు. పవన్ ఆ ఇద్దరి వెనుక వైపు నుంచొన్నాడు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 పిక్ ని చూసిన ఫ్యాన్స్ అయితే శ్రీలీల ని  పవన్  ఆట పట్టించే సీన్ అయి ఉంటుందంటూ కామెంట్స్  చేస్తున్నారు.   ఎన్నికల రిజల్ట్ హడావిడి అయిపోవడంతో  ఉస్తాద్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు. ఆ కొత్త షెడ్యూల్ లో  పవన్ కూడా పాల్గొనబోతున్నాడు. ఓజి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ముందు హరిహర, ఉస్తాద్ ని పవన్ వీలయ్యినంత త్వరగా పూర్తి చెయ్యాలనుకుంటున్నాడనే వార్తలు వినపడుతున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.  

 



Source link

Related posts

టాప్‌ హీరోలతో నో ఛాన్స్‌.. అందుకే యంగ్‌ హీరోతో!

Oknews

ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

తమిళనాడు ని కుదిపేస్తున్న తెలుగు నటి విడాకులు 

Oknews

Leave a Comment