Entertainment

పవన్ కళ్యాణ్ కి కూడా సాధ్యంకాని ఫీట్ తేజ సజ్జా సొంతం!


తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మామూలు సినిమాలతో కూడా సంచలన వసూళ్లు రాబడతాడు. రెండున్నర దశాబ్దాల కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించాడు పవన్. అయితే ఒక ఫీట్ మాత్రం పవర్ స్టార్ కి అందని ద్రాక్షలా మారింది. అదే రూ.100 కోట్ల షేర్ క్లబ్.

పవన్ కళ్యాణ్ తోటి స్టార్స్ అందరూ ఇప్పటికే వంద కోట్ల షేర్ క్లబ్ లో చేరారు. అయితే పవన్ ఇప్పటిదాకా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకపోవడం, రాజకీయాలతో బిజీగా ఉండి ఇటీవల ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుండటంతో ఆయన స్థాయికి తగ్గ వసూళ్లు రావడంలేదు. పవర్ స్టార్ కెరీర్ లో ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘భీమ్లా నాయక్’ ఉంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.98 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు చాలా తక్కువగా ఉండటం ‘భీమ్లా నాయక్’ వసూళ్లపై ప్రభావం చూపించింది. లేదంటే ఆ సినిమా ఈజీగా రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరేది. అయితే ఇప్పుడు ఈ వంద కోట్ల ఫీట్ ని పవన్ కంటే ముందుగా ఒక కుర్ర హీరో సాధిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

తేజ సజ్జా(teja sajja) హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హనుమాన్'(hanuman). ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వారం రోజుల్లోనే రూ.75 కోట్ల షేర్ తో సత్తా చాటింది. వీకెండ్, వీక్ డేస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరడం ఖాయమైంది. అలాగే గ్రాస్ పరంగా రూ.200 కోట్లకు పైగా రాబడుతుంది అనడంలో సందేహం లేదు. ఇంతవరకు పవన్ కల్యాణే రూ.100 కోట్ల షేర్, రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరలేదు. అలాంటిది ఆయన కంటే ముందు.. ఒక కుర్ర హీరో ఈ ఫీట్ సాధించనుండటం నిజంగా విశేషమనే చెప్పాలి. సినిమాలో విషయం ఉంటే హీరోతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించవచ్చని ‘హనుమాన్’తో మరోసారి రుజువైంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘ఓజీ’ ఎప్పుడు విడుదలైనా.. భారీ వసూళ్లతో పవర్ స్టార్ అసలుసిసలైన బాక్సాఫీస్ స్టామినాని తెలియజేస్తుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఆ సినిమాతో ఆయన ఒకేసారి రూ.300 లేదా రూ.400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదు.



Source link

Related posts

ఏప్రిల్ 7 నే మహేష్  గుంటూరు కారం… ఇది నిజం

Oknews

పూరి చేసిన పనికి హీరోయిన్ కేతిక శర్మ పంట పండింది!

Oknews

రూపాన్ని మార్చుకోవడం కోసం ఆస్ట్రేలియాకు రామ్ చరణ్!

Oknews

Leave a Comment