Top Stories

ప‌వ‌న్‌, లోకేశ్ క‌లిస్తే.. ద‌బిడి ద‌బిడేనా!


వైసీపీ దృష్టిలో చంద్ర‌బాబు క‌న్న‌పుత్రుడు లోకేశ్‌, ద‌త్త పుత్రుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్. ఇందులో పుత్రుడ‌నే బంధం కామ‌న్‌. మిగిలివన్నీ సేమ్ టు సేమ్‌. ఇప్పుడీ ఇద్ద‌రు నాయ‌కులు ఒకే వేదిక మీద‌కి రానున్నారు. దీంతో అధికార ప‌క్షం వైసీపీకి ఇక ద‌బిడి ద‌బిడే అని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. వైసీపీ నుంచి దీటైన కౌంట‌ర్ కూడా వ‌చ్చింది. ఇద్ద‌రు స‌న్యాసులు రాసుకుంటే రాలేది బూడిదే త‌ప్ప‌, స‌మాజానికి ఒరిగేదేమీ లేద‌ని దెప్పి పొడ‌వ‌డం గ‌మ‌నార్హం.

స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యిన చంద్ర‌బాబునాయుడిని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉంచారు. 40 రోజులకు పైగా ఆయ‌న అక్క‌డే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. బాబుకు జైలు నుంచి విముక్తి ఎప్పుడో తెలియ‌ని ప‌రిస్థితి. బాబుతో ములాఖ‌త్‌కు వెళ్లిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ త‌ర్వాత జైలు బ‌య‌ట టీడీపీతో పొత్తు వుంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఇదంతా ఎంతో నాట‌కీయంగా సాగింది. అంత‌కు ముందే టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తుపై అవ‌గాహ‌న వుంది.

బాబును జైలు వేయ‌డాన్ని సాకుగా తీసుకుని ప‌వ‌న్ పొత్తు ప్ర‌క‌ట‌న చేశారు. రెండు పార్టీల మ‌ధ్య స‌మన్వ‌యం కోసం ఇరువైపులా ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. అయితే ఒక మంచి ముహూర్తాన రెండు పార్టీల స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డం విశేషం. ఇందుకు ద‌స‌రా వేళ‌లో ఈ నెల 23న మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు రాజ‌మండ్రిలో తొలి భేటీ జ‌ర‌గ‌నుంది.

ఈ భేటీలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, లోకేశ్ పాల్గొన‌నున్నారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గద్దె దించ‌డానికి ఎలాంటి కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌నే అంశాల‌పై ప‌వ‌న్‌, లోకేశ్ అధ్య‌క్షత‌న చ‌ర్చిస్తారు. వీళ్లిద్ద‌రి క‌ల‌యికతో వైసీపీని ఎంత వ‌ర‌కూ రాజ‌కీయంగా నిరోధించ‌గ‌ల‌ర‌నేది ప్ర‌ధాన చ‌ర్చ‌. ఎందుకంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మెరుపు తీగ‌లా అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే రాజ‌కీయంగా మెరుస్తుంటారు. మిగిలిన రోజుల్లో షూటింగ్‌ల్లో బిజీగా వుంటారు. 

ఇక లోకేశ్ విష‌యానికి వ‌స్తే, తండ్రిని అరెస్ట్ చేయ‌గా, ఢిల్లీకి పారిపోయాడ‌నే చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర గురించి పూర్తిగా మ‌రిచిపోయారు. భ‌విష్య‌త్‌కు భ‌రోసా పేరుతో బ‌స్సుయాత్ర చేస్తానంటున్నారు. టీడీపీ సంక్షోభ స‌మ‌యంలో లోకేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు.. వార‌సుడిగా పార్టీని ముందుకు న‌డ‌ప‌లేర‌నే నెగెటివిటీని సంపాదించుకున్నారు. 

రాజ‌కీయంగా స్థిర‌త్వం లేని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, క‌ష్ట స‌మ‌యంలో ధైర్యంగా నిల‌వ‌లేని లోకేశ్ నాయ‌క‌త్వం.. ఇలా క‌న్న‌, ద‌త్త పుత్రుల క‌ల‌యిక టీడీపీ-జ‌న‌సేన కూట‌మిని ఏ తీరాల‌కు చేరుస్తుంద‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చంద్ర‌బాబు ఇప్ప‌ట్లో బ‌య‌టికి రాక‌పోతే, కూట‌మిని అధికారం వైపు న‌డిపించే బాధ్య‌త మాత్రం ప‌వ‌న్‌, లోకేశ్‌ల‌పై ఉంది. బాధ్య‌త‌ల్ని విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తిస్తారా? లేదా? అన్న‌ది కాల‌మే తేల్చాల్సి వుంది.



Source link

Related posts

చంద్రబాబు చేతగానితనం చాటి చెప్పిన సతీమణి!

Oknews

వారెవ్వా కిషన్ రెడ్డి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!

Oknews

జ‌గ‌న్‌ను ఏం మాయ చేశావ‌య్యా!

Oknews

Leave a Comment