Top Stories

పవన్ సినిమా క్వాలిటీ లేదా.. హరీష్ ఏమంటున్నాడు?


ఉస్తాద్ భగత్ సింగ్ లో క్వాలిటీ లేదా? ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో పవన్ కల్యాణ్, కాల్షీట్ ఇవ్వడమే ఎక్కువ కాబట్టి, ఏదో ఒకటి చుట్టేస్తున్నారా? ఇదే అర్థం వచ్చేలా ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దానికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు హరీశ్ శంకర్.

"ఉస్తాద్ భగత్ సింగ్ 50శాతం షూట్ పూర్తి అయిందంటగా.. ఇక క్వాలిటీ అంటావా ఆ దేవుడిపైనే భారం వేశాం." అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి గట్టిగా రియాక్ట్ అయ్యాడు హరీశ్. "అంతేకదా తమ్ముడు, అంతకుమించి నువ్వేం చేయగలవు చెప్పు. ఈలోగా కాస్త కెరీర్, జాబ్, స్టడీస్ మీద ఫోకస్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు" అంటూ సున్నితంగా క్లాస్ పీకాడు.

పవన్ కల్యాణ్ హీరోగా సినిమా ఎనౌన్స్ చేసిన తర్వాత ఆ మూవీని సెట్స్ పైకి తీసుకురావడం కోసం నిర్మాతలతో పాటు, చాలా కష్టపడ్డాడు దర్శకుడు హరీశ్ శంకర్. అతడి మూవీ కంటే లేట్ గా ప్రారంభమైన సినిమాలు కూడా సెట్స్ పైకొచ్చినా, ఓపిగ్గా ఎదురుచూశాడు.

మొత్తానికి అతడు కలలుగన్న రోజు రానే వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చేసిన ఒక్క షెడ్యూల్ నుంచే అభిమానుల కోసం గ్లింప్స్ రిలీజ్ చేశాడు హరీశ్. ఆ తర్వాత మళ్లీ గ్యాప్.

ఎట్టకేలకు తాజాగా మరో షెడ్యూల్ మొదలైంది. ఇలా టైట్ షెడ్యూల్స్ మధ్య, అతి కష్టమ్మీద షూటింగ్ చేస్తున్న టైమ్ లో ఇలాంటి కామెంట్స్ పడేసరికి హరీష్ కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే ఇలా సున్నితంగా క్లాస్ పీకాడు.

మరోవైపు తన సోషల్ మీడియా ఎకౌంట్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. తను ఎవ్వరికీ భయపడనని, అనాలనుకుంటే తన ఎకౌంట్ లోనే అంటానని, మరో ఫేక్ ఎకౌంట్ తనకు అక్కర్లేదని చెప్పుకొచ్చాడు. హరీశ్ శంకర్ ఘోస్ట్ ఎకౌంట్ లో అన్నీ బూతులే ఉన్నాయంటూ వచ్చిన ఓ పోస్టుకు స్పందిస్తూ.. తను బూతుల్ని, అసభ్యతను ఎంకరేజ్ చేయనని స్పష్టం చేశాడు.



Source link

Related posts

ఆహా ఓహో అనే రేంజ్ నుంచి వామ్మో అనే స్థాయికి..!

Oknews

ప్రియుడి కోసం మరో అక్రమ చొరబాటు

Oknews

వెంకయ్య.. ఇంకా డొంకతిరుగుడు అవసరమా?

Oknews

Leave a Comment