Paleru News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో పాలేరు ఒకటి. ఈసారి కీలక నేతలు పాలేరు బరిలో నిలుస్తు్న్నారు. దీంతో అందరి చూపు “పాలేరు”పై కేంద్రీకృతమైంది. ఈ క్రమంలోనే పాలేరు నియోజకవర్గంలో గెలుపును గులాబీ బాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ తో పొత్తుల్లో భాగంగా సీపీఎం సైతం పాలేరు సీటునే ఆశిస్తోంది. అన్నింటికంటే ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ఇక్కడ బడా కాంట్రాక్టర్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతారనే ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ఈ స్థానంలో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది.