Health Care

పిల్లల్ని కనేందుకు ఏకంగా రూ. 2.5 కోట్లు డిమాండ్‌ చేస్తున్న భార్య!


దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటారు. తర్వాత పెళ్లయిన ప్రతి ఒక్క కపుల్ తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుంటారు. ఆ అద్భుతమైన ఘట్టం కోసం ఎదురుచూస్తారు. అందరి జీవితాల్లో ఓ బిడ్డకు తల్లిదండ్రులవ్వడం అనేది అద్భుతమైన విషయం. ఇక మహిళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి బిడ్డ జన్మించే వరకు చాలా జాగ్రత్తలు వహిస్తారు. నాణ్యమైన ఫుడ్ తీసుకోవడం, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం, రన్నింగ్ చేయకుండా జాగ్రత్తగా నడవడం.. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పండంటి బిడ్డలకు జన్మనిస్తారు.

బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ప్రస్తుత రోజుల్లో పేరెంట్స్ అదృష్టానికి నోచుకోలేకతున్నారు. ఇలాంటి జంటలు చాలా మంది.. హాస్పిటల్స్, తీర్థయాత్రలు, పూజారుల చుట్టూ తిరుగుతుంటారు. ఎలాగైనా తమ కడుపు పండాలని సవాలక్ష ప్రయత్నాలు చేస్తారు. అయితే ఓ మహిళ అమ్మతనాన్నే ఒక విలాసవంతమైన అవకాశంగా మార్చుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకెళ్తే.. దుబాయ్‌కి చెందిన సౌదీ అనే మహిళ ఓ కోటీశ్వరుడిని వివాహం చేసుకుంది. భర్త సంపదను ఖర్చు చేస్తూ ఆమె లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తానే స్వయంగా ఓ వీడియోలో పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే తాజాగా సౌదీ తన భర్తతో పిల్లలను కనేందుకు అతడి నుంచి ఏకంగా రూ.2.5 కోట్లు డిమాండ్‌ చేసిందట. ఆమె గర్భం, ప్రసవాన్ని ఖరీదైన బహుమతులు, ఖరీదైన హాలిడేలు, ప్రత్యేకమైన డెస్టినేషన్‌లకు సౌదీ టూర్లు ప్లాన్ చేస్తుందట. సౌదీ గర్భం దాల్చేందుకు రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు విలువైన కారు, హీర్మేస్ బిర్కిన్ హ్యాండ్‌బ్యాగ్‌ వంటివి కొనాలని డిమాండ్ కూడా చేసిందట.

ప్రతి బిడ్డకు £200, 000 (దాదాపు రూ. 2 కోట్లు) భత్యం కావాలంటుందట. పుట్టబోయే పిల్లల జెండర్‌కి అనుగుణంగా పలు రంగులతో కూడిన డైమండ్ రింగ్, డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్ వంటి విలాసవంతమైన వస్తువులను డిమాండ్ చేస్తుందట. ప్రతి ప్రసవానికి నిర్ణీత రేటును సౌదీ నిర్ణయించిందట. ఇప్పటికే అత్యంత విలువైన కార్లను కొనుగోలు చేసిందట సౌదీ. ఈ వార్త విన్న జనాలు చాలా మంది.. బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎవరైనా ఇలాంటి కండిషన్స్ పెడతారా అంటూ సౌదీపై కోపాన్ని ప్రదర్శించగా.. మరికొంతమంది దుబాయ్ లో ఇవన్నీ కామన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

లైంగిక కోరికలు రాకుండా చేసే రోగం.. దీని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!



Source link

Related posts

నలుపు రంగు బట్టలు ఎందుకు ధరించకూడదో తెలుసా..?

Oknews

30 యేళ్ల అద్భుత గ్రహ యోగం.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

Oknews

మీ పిల్లలు పెళ్ళికి “నో ” చెబుతున్నారా.. తిరస్కరించడానికి ఇవే కారణాలంటూ షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు

Oknews

Leave a Comment