Health Care

పుట్టుకతో వచ్చే గుండె లోపాలను ఎలా తెలుసుకోవచ్చో తెలుసా?


దిశ, ఫీచర్స్ : నవజాత శిశువుల్లో గుండె సమస్యలు అనేవి కామన్. ఇండియన్ పీడియాట్రిక్స్ ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షలకు పైగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల పిల్లలు ఉన్నారు. ఇక ఈ సమస్యలు పుట్టిన వెంటనే కొంత మందిలో కనిపిస్తే, నెల రెండు నెలల తర్వాత కొందరిలో కనిపిస్తాయి. అయితే గుండె సమస్యలు ఉన్న శిశువు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక గుండె గదుల మధ్య రంధ్రం సహజమే. పిండంలో చెడు రక్తాన్ని తల్లి శరీరమే శుద్ధి చేస్తుంది. ఈ రక్తం పిండానికి చేరుకోవడానికి పై రెండు గదుల మధ్య సహజంగా ఏర్పడే ఫొరామినా ఓవేల్ తోడ్పడుతుంది. ఇక ఇది శిశువులకు అంత ప్రమాదకరం కాదు. బిడ్డ పుట్టిన నాలుగు నుంచి ఆరు వారాల్లో ఇది మూసుకుపోతుంది. కానీ కొంత మందికి గుండె ప్రధాన రక్తనాళాల్లోనూ రంధ్రాలు ఏర్పడవచ్చు, ఇది పిల్లలకు కాస్త ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు దీన్ని తేలికగా తీసుకుని పట్టించుకోరు. కానీ ఇదే పిల్లల జీవితంలో పెద్ద సమస్యకు దారి తీయవచ్చు. అందువలన హార్ట్ ప్రాబ్లమ్స్‌తో పుట్టిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు వారిని పరీక్షించుకోవాలంటున్నారు వైద్యులు.

అయితే కొంత మంది తల్లిదండ్రులకు శిశువు గుండె లోపాలను అర్థం చేసుకోలేరు. అయితే గుండెలో రంధ్రాలు ఈ ఆనవాళ్లతో ఈజీగా గుర్తించవచ్చునంట. అది ఎలానో ఇలా తెలుసుకుందాం.

శిశువుల్లో గుండె సమస్యలు ఇలా తెలుసుకోండి

శిశువు పుట్టిన నెల తర్వాత డొక్కలు ఎగరేస్తూ శ్వాస తీసుకోవడం.

శ్వాస చాలా వేగంగా తీసుకోవడం

పాలు తాగే సమయంలో తీవ్ర అలసట

చిన్న పిల్లలకు విపరీతమైన చెమటలు

అలసట, అసహనం ప్రదర్శించడం, వేగవంతమైన హృదయ స్పందన రేటు, ఛాతీ నొప్పి, తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీలిరంగు చర్మం (సైనోసిస్), సరైన ఆహారం తీసుకోవడం, విపరీతమైన చెమట.



Source link

Related posts

రెండో శనివారం సెలవు ఎందుకో తెలుసా?

Oknews

చేపలకు గోరుముద్దలు పెడుతున్న బాతు.. వీడియో వైరల్

Oknews

Free Vine: మందుబాబులకు గుడ్ న్యూస్.. ట్యాప్ తిప్పి గ్లాసులో పట్టుకుని ఫ్రీగా వైన్ తాగేయడమే..ఎక్కడంటే?

Oknews

Leave a Comment