పుష్ప 2 (pushpa 2) కి సంబంధించిన ఒక తాజా వార్త ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుంది. అది అలాంటి ఇలాంటి వార్త కాదు. ఇంతవరకు ఎవరకు ఉహించనది. తెలుగు తెరపై ఎన్నో సరికొత్త కాంబినేషన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు రాబోయే కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా ఒక వండర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) పుష్ప 2 లో మెరవబోతున్నాడు.
ఔను ఇది నిజం. పుష్ప 2 లో పవన్ కళ్యాణ్ మెరవబోతున్నాడు. కాకపోతే నటుడుగా కాదు తన మాటల్ని అందించబోతున్నాడు. బన్నీ ఇంట్రడక్షన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ని ఇవ్వబోతుడు. అంటే పుష్ప గురించి పవన్ చెప్పనున్నాడు. కాకపోతే పుష్ప టీం ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో ఇది నిజం అంటూ ఒక న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంది. చిత్ర యూనిట్ కావాలనే ఈ విషయాన్నీ సీక్రెట్ గా ఉంచుతుందని అంటున్నారు. ఆల్రెడీ పవన్ తన డబ్బింగ్ ని కూడా కంప్లీట్ చేసాడనే వార్త కూడా వస్తుంది. ఇప్పడు ఈ న్యూస్ బన్నీ అండ్ పవన్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తీసుకొస్తుంది.
ఇటీవల అల్లు అర్జున్ (allu arjun) బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి చిన్న పాటి టీజర్ రిలీజ్ అయ్యింది.ఇలా రిలీజ్ అయ్యిందో లేదో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు పవన్ న్యూస్ కూడా తోడవ్వడంతో ఇక అందరిలో పుష్ప గురించే చర్చ నడుస్తుంది. అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న పుష్ప 2 లో బన్నీ సరసన రష్మిక మందన్న జోడి కుడుతుంది. మైత్రి మూవీస్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. సుకుమార్ దర్శకుడు.