EntertainmentLatest News

పూరి జగన్నాధ్ గురించి అమ్మ చెప్పిన నిజం..ఏ జన్మలో రుణమో  


తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకుల్లో పూరి జగన్నాధ్ కూడా ఒకరు. ఆయన తెరకెక్కించే సినిమాలు మూస పద్దతిలో కాకుండా ఒక డిఫెరెంట్ లుక్ తో ఉంటాయి. అలాగే ఎలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు తీసినా కూడా అందులో అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. తాజాగా పూరి మదర్ చెప్పిన ఒక విషయం ఇప్పుడు పలువురిని ఆలోచింపచేస్తుంది.

పూరి జగన్నాధ్ దగ్గర చాలా సంవత్సరాల పాటు ఒక వ్యక్తి పని చేసాడు. అప్పుడు ఆ వ్యక్తి పూరి ని నమ్మించి 80 కోట్ల వరకు మోసం చేసాడు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకొని మన డబ్బులు మనకి వచ్చే దాకా కొడదామని ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. అప్పుడు పూరి తన ఫ్రెండ్ తో ఏ జన్మలోనో అతనికి మనం బాకీ అని చెప్పి అతన్ని పట్టించుకోవడం మానేసాడు. ఆ తర్వాత ఒక సినిమా వలన పూరికి ఆర్ధిక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ టైంలో  తన నాలుగు ఇళ్ళని అమ్మేసి రోడ్ మీద కి వచ్చాడు. ఈ విషయాలన్నీ పూరి తల్లి అమ్మాజీ ఇటీవల ఇచ్చిన ఒక  ఇంటర్వ్యూ లో చెప్పింది.సినిమా కోసం పూరి చాలా కష్టాలు పడ్డాడని కూడా ఆమె చెప్పింది.ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూరి ప్రస్తుతం  డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహా శివరాత్రి కానుకగా మర్చి 8 న విడుదల కాబోతున్న ఈ మూవీ లో  రామ్ పోతినేని హీరోగా చేస్తున్నాడు. కాగా ఈ మూవీ పూరి కి 43 వ చిత్రం.ఒకప్పటి హీరోయిన్ ఛార్మి కౌర్ తో కలిసి పూరి ఈ చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. 

 



Source link

Related posts

ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి?

Oknews

మొట్టమొదటి మూవీ అల్లు అర్జున్ పుష్ప 2 నే.. తగ్గేదేలే అంటున్న ఫ్యాన్స్  

Oknews

Mrunal Thakur says marriage and children పెళ్లి, పిల్లలపై మృణాల్ విచిత్ర కోరిక

Oknews

Leave a Comment