EntertainmentLatest News

పెళ్లి కార్డు అనుకున్నాం బ్రో.. ఇలా మోసం చేస్తావనుకోలేదు


నవదీప్ అంటే సిల్వర్ స్క్రీన్ మీద ఒక మంచి  క్రేజ్ ఉన్న హీరో. నవదీప్ చేసే ఏ మూవీ ఐనా కూడా అందులో హీరోకి సమానంగా ఉన్న పాత్ర ఐతేనే చేస్తాడు. లేదంటే నిర్మొహమాటంగా నో అనేస్తాడు. మొదట్లో అన్ని రకాల సినిమాలు చేసిన నవదీప్ తర్వాత పర్ఫెక్ట్ రోల్ ఓరియెంటెడ్ మూవీస్ ని ఎంచుకుంటూ వచ్చాడు. ధృవ, ఈగల్, నేనే రాజు నేనే మంత్రి ఈ మూవీస్ అన్నిటిలో హీరోతో సమానంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే రీసెంట్ గా రిలీజై అందరిలో ఒక ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేసిన ఆపరేషన్ వాలెంటైన్ లో వింగ్ కమాండర్ కబీర్ గా నవదీప్ పోషించిన పాత్రకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పారు ఆడియన్స్. అలాంటి నవదీప్ ఇప్పుడు ఒక సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. 

తాజాగా ఒక వీడియో పెట్టి  అసలు విషయం రేపు చెప్తాను అన్నాడు నవదీప్. ఇక ఇప్పుడు ఆ విషయాన్నీ రివీల్ చేస్తూ మరో  వీడియోని విడుదల చేసాడు. ఒక పసుపు కుంకుమ పెట్టిన బాక్స్ చూపిస్తూ దాన్ని తెరిచి అందులో ఒక పెళ్లి కార్డు లాంటిదాన్ని చూపించాడు. ఇక ఆ కార్డు చూస్తే నిజంగానే పెళ్లి కార్డు అని భ్రమ పడకుండా ఉండరు. మీరంతా ఎదురుచూస్తున్న ఆ డేట్ ని రివీల్ చేసేస్తున్నా అంటూ ఆ కార్డుని తీసి చూపించాడు. అందులో చిరంజీవి నవదీప్ అండ్ చి.ల.సౌ. పంకూరి, శుభముహూర్తం 19 ఏప్రిల్ శుక్రవారం మీ దగ్గర థియేటర్స్ లో చూడండి అంటూ మూవీ రిలీజ్ ప్రమోషన్ ని ఒక పెళ్లి తరహాలో చేసి అందరికీ షాకిచ్చాడు. ఇక నెటిజన్స్ ఐతే “ఇంకా పెళ్లి కార్డు అనుకున్నాం…పెద్ద ప్లానింగే, లవ్ మౌళి వస్తుంది, తర్వాత నవదీప్ పెళ్లి అవుతుంది..పెళ్లి కార్డులో మూవీ రిలీజ్ డేట్..ఏమన్నా కాన్సెప్టా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నవదీప్ మాత్రం పెళ్లి పేరుతో నెటిజన్స్ కి నిజంగానే ఒక ఝలక్ ఇచ్చాడు.



Source link

Related posts

ts model schools admission application date extended till march 2 apply now

Oknews

ఈ రోజు నందమూరి తారకరత్న జయంతి

Oknews

నిన్న కృతి, నేడు శ్రీలీల.. మూన్నాళ్ళ ముచ్చటేనా!

Oknews

Leave a Comment