Entertainment

పెళ్లి పేరుతో కెమెరా అసిస్టెంట్ ని శారీరకంగా వాడుకున్న మహిళా సినీ నిర్మాత


ప్రస్తుత ప్రపంచంలో పెళ్ళిళ్ళకి డబ్బులకి సంబంధించిన మోసాలకి ఎలాంటి కొదవ లేదు. సినిమా పరిశ్రమ అందుకు మినహాయింపు ఏమి కాదు. అడపాదడపా సినిమా పరిశ్రమకి చెందిన వారు కూడా మోసపోతూనే ఉన్నారు.అలాగే సినిమా పరిశ్రమకి చెందిన వారు కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకున్న సందర్భాలు కూడా  ఉన్నాయి. తాజాగా సినీమా  పరిశ్రమకి చెందిన మోసం తాలూకు న్యూస్ ఒకటి సంచలనం సృష్టిస్తుంది.

నాగార్జున అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్ గా చేస్తున్నాడు. ఈ క్రమంలో భైరవపురం అనే సినిమా షూటింగ్ కి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా నిర్మాత అయినా ఆశా మల్లిక తో పరిచయం ఏర్పడింది.దీంతో మల్లిక నాగార్జున ని తన ఇంటికి పిలిపించుకొని అతనంటే ఇష్టం అని చెప్పింది. ఆ తర్వాత  తనకి పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నానని చెప్పడంతో  మల్లిక ని ఇష్టపడిన నాగార్జున ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున దగ్గర నుంచి మల్లిక విడతల వారీగా సుమారు 25 లక్షల రూపాయిల దాకా వసులు చేసింది. దీంతో ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చిన నాగార్జున ఆమె గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేసాడు. ఆ ఎంక్వయిరీ లో  ఆమెకి అంతకు ముందే రెండు పెళ్లిలు అయ్యాయని ముగ్గురు పిలల్లు కూడా  ఉన్నారని  తెలిసింది.

దీంతో తన డబ్బులు ఇవ్వమని మల్లికని  నాగార్జున  నిలదీయడంతో  నాగార్జున మీద మల్లిక  గృహహింస నేరం కింద కేసు నమోదు చేసింది. పైగా ఆ కేసు విత్ డ్రా చేసుకోవాలంటే నాగార్జున కి ఉన్న ఆస్తిలో సగం వాటా రాయాలని కోరింది.దీంతో ఇక చేసేది లేక నాగార్జున పోలీసులని ఆశ్రయించడంతో మల్లిక మోసాల చిట్టా మొత్తం బయట పడింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మల్లిక  గతంలో తన ఇద్దరి భర్తల మీద కూడా  గృహహింస కేసు నమోదు చేసింది. 

 



Source link

Related posts

డబ్బు, హోదా ఉందని అలా చేస్తారా, క్రిమినల్ అంటూ రెచ్చిపోయిన పూనమ్ కౌర్

Oknews

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ ఇతనే.. బాలయ్య షాకింగ్ డెసిషన్!

Oknews

'అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌' మూవీ రివ్యూ

Oknews

Leave a Comment